Ravi Teja | రవితేజ ప్రస్తుతం వరుసగా సినిమాలను ఓకే చేస్తూ షూటింగ్‌లను పూర్తి చేస్తున్నాడు. ప్రస్తుతం ఈయన నాలుగు సినిమాలను సెట్స్ పైన పెట్టాడు. గతనెలలో విడుదలైన ‘ఖిలాడీ’ ప్రేక్షకులను అనుకున్న స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. దాంతో రవితేజ తన నెక్ట్స్ సినిమాలపై ఫుల్ ఫోకస్‌ను పెట్టాడు. ప్రస్తుతం ఈయన నటించిన ‘రామారావు ఆన్ డ్యూటీ’ షూటింగ్ పూర్తికాగా ‘ధమాకా’ ఇటీవలే నాలుగవ షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది. వీటితో పాటుగా ‘రావణాసుర’ కూడా ఇటీవలే షూటింగ్ మొదలు పెట్టింది. ఈ క్రమంలో తాజాగా రవితేజ నటిస్తున్న మరో సినిమా ‘టైగర్ నాగేశ్వరరావు’ షూటింగ్ తాజాగా ప్రారంభమైంది.
ఇటీవలే చిరంజీవి గెస్ట్‌గా పూజా కార్యక్రమాలను జరుపుకున్న ఈ చిత్రం నిర్మాత అగర్వాల్ బర్త్‌డే సందర్భంగా షూటింగ్‌ను ప్రారంభించింది. ఈ చిత్రం ఇండియన్ రాబిన్ హుడ్‌గా పిలవబడే గజదొంగ టైగర్ నాగేశ్వరరావు జీవిత కథ ఆధారంగా తెరకెక్కనుంది. 70,80 దశకాల్లో నాగేశ్వరరావు ఆంధ్ర ప్రదేశ్‌లో భారీ ఎత్తున దొంగతనాలు, దోపిడీలు చేస్తూ పోలీసులకు చిక్కకుండా తప్పించకునే వాడు. ఇలాంటి గజదొంగ కథ బయోపిక్‌గా తెరకెక్కనుంది అని తెలియడంతో ప్రేక్షకులలో ఆసక్తి నెలకొంది. ఈ చిత్రానికి వంశీ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు. అభిషేక్ అగర్వాల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఈ చిత్రంలో రవితేజకు జోడిగా నుపూర్ సనన్, గాయత్రి భరద్వాజ్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు.
Read Also:
Beast | భారీగా ‘బీస్ట్’ ప్రీ-రిలీజ్ బిజినెస్.. తెలుగులో బ్రేక్ఈవెన్ సాధ్యమేనా?
Telugu Movies | ఈ వారం థియేటర్/ఓటీటీలలో సందడి చేయబోతున్న సినిమాలు ఇవే
Naga Chaitanya | నాగచైతన్య కారుకు జరిమాన విధించిన పోలీసులు..!