Beast | భారీగా ‘బీస్ట్’ ప్రీ-రిలీజ్ బిజినెస్.. తెలుగులో బ్రేక్ఈవెన్ సాధ్యమేనా?
తమిళ స్టార్ విజయ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 'తుపాకీ' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమై మంచి క్రేజ్‌ను ఏర్పరచుకున్నాడు. అప్పటినుంచి ఈయన నటించిన ప్రతి సినిమా తమిళంతో పాటు తెలుగులో ఏకకాలంలో విడుదలవుతున్నాయి.
Beast Telugu business | తమిళ స్టార్ విజయ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ‘తుపాకీ’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమై మంచి క్రేజ్‌ను ఏర్పరచుకున్నాడు. అప్పటినుంచి ఈయన నటించిన ప్రతి సినిమా తమిళంతో పాటు తెలుగులో ఏకకాలంలో విడుదలవుతున్నాయి. లేటెస్ట్గా ఈయన నటించిన చిత్రం ‘బీస్ట్’. ‘డాక్టర్’ ఫేం నెల్సన్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంపై ప్రేక్షకులలో భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఇటీవలే విడుదలైన ట్రైలర్ అంచనాలను రెట్టింపు చేశాయి. యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం ఏప్రల్ 13న తమిళంతో పాటు తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం భారీగానే బిజినెస్ జరుపుకుంది.
ఈ చిత్రానికి నైజాంలో రూ 3.50 కోట్ల వరకు బిజినెస్ జరుగగా ఆంధ్రప్రదేశ్‌లో రూ. 6.50 కోట్ల వరకు బిజినెస్ జరిగింది. మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం 10కోట్ల బిజినెస్‌ను జరుపుకుంది. ఈ చిత్రం తెలుగులో క్లీన్ హిట్ సాధించాలంటే రూ.10.50 కోట్ల షేర్ కలెక్షన్లను సాధించాలి. విజయ్ గత చిత్రం ‘మాస్టర్’కు తెలుగులో 4కోట్ల బిజినెస్ జరిగింది. ఈ చిత్రానికి ఏకంగా 6కోట్ల వరకు విజయ్ మార్కెట్ పెరిగింది. ఈ చిత్రాన్ని తెలుగులో దిల్‌రాజు విడుదల చేస్తున్నాడు. పూజా హెగ్డే హీరోయిన్గా నటించింది. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ ఈ చిత్రాన్ని నిర్మించాడు.
Read Also:
Telugu Movies | ఈ వారం థియేటర్/ఓటీటీలలో సందడి చేయబోతున్న సినిమాలు ఇవే
Naga Chaitanya | నాగచైతన్య కారుకు జరిమాన విధించిన పోలీసులు..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
Rajinikanth | ‘జైలర్ 2’ కలెక్షన్ల పోస్టర్లు ఎందుకు వేయడం లేదు.. రజనీకాంత్ పీఆర్ కీలక వ్యాఖ్యలు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

