Naga Chaitanya | నాగచైతన్య కారుకు జరిమాన విధించిన పోలీసులు..!
యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య కారుకు హైదరాబాద్ పోలీసులు జరిమానా విధించారు. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వద్ద నాగచైతన్య కారుని ఆపి ట్రాఫిక్ పోలీసులు సోదాలు నిర్వహించారు. అంతేకాకుండా నాగచైతన్య కారుకి ఉన్న
Naga Chaitanya | యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య కారుకు హైదరాబాద్ పోలీసులు జరిమానా విధించారు. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వద్ద నాగచైతన్య కారుని ఆపి ట్రాఫిక్ పోలీసులు సోదాలు నిర్వహించారు. అంతేకాకుండా నాగచైతన్య కారుకి ఉన్న బ్లాక్ ఫిలింను తొలిగించి రూ.700 జరిమానా విధించారు. ఆ సమయంలో నాగచైతన్య కారులోనే ఉన్నాడు. వై కేటగిరీ ఉన్న వ్యక్తులు మాత్రమే బ్లాక్ ఫిలింను ఉపయోగించాలని సుప్రిం కోర్డు ఆదేశించిన విషయం తెలిసిందే. ఇటీవలే ఎన్టీఆర్, అల్లుఅర్జున్, త్రివిక్రమ్, మంచుమనోజ్ కార్లకు కూడా ఈ విషయంలో జరిమాన పడిన విషయం తెలిసిందే. ఈ విషయంలో పోలీసులు చాలా స్ట్రిక్ట్‌గా వ్యవహరిస్తున్నారు. ఇలాంటి కార్లు ఎక్కడ కనిపించినా సోదాలు నిర్వహిస్తున్నారు.
ఇక నాగచైతన్య ప్రస్తుతం వరుస హిట్లతో జోరు మీదున్నాడు. ‘బంగార్రాజు’తో ఈ ఏడాది మొదటి బ్లాక్ బస్టర్‌ను సాధించాడు. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘థాంక్యూ’ షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రోడక్షన్ పనులు జరుగుతున్నాయి. రాశిఖన్నా హీరోయిన్గా నటించిన ఈ చిత్రాన్ని శ్రీవెంకటేశ్వరా బ్యానర్‌పై దిల్‌రాజు, శిరీష్‌లు నిర్మిస్తున్నారు. ఇది ఇలా ఉండాగానే విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ‘భూత’ అనే వెబ్ సిరీస్‌లో నటిస్తున్నాడు. ఇటీవలే ఈ వెబ్ సిరీస్ షూటింగ్ ప్రారంభమైంది.
Read Also:
Telugu Movies | ఈ వారం థియేటర్/ఓటీటీలలో సందడి చేయబోతున్న సినిమాలు ఇవే
RRR | ‘నాటు నాటు’ వీడియో సాంగ్ విడుదల
Deepika padukone | ఎన్టీఆర్‌కు జోడీగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

