RamaRao On Duty First single | మాస్రాజ రవితేజ ప్రస్తుతం వరుసగా సినిమాలను చేస్తూ తీరిక లేకుండా షూటింగ్లలో పాల్గొంటున్నాడు. ఏడాదికి రెండు సినిమాలను విడుదల చేసే విధంగా రవితేజ ప్లాన్ చేస్తున్నాడు. ప్రస్తుతం ఈయన చేతిలో నాలుగు సినిమాలున్నాయి. గతనెల ‘ఖిలాడీ’తో భారీ ఫ్లాప్‌ను అందుకున్న మాస్రాజ ఈ సారి ‘రామారావు ఆన్ డ్యూటీ’తో ఎలాగైనా మంచి హిట్టు సాధించాలని కసితో ఉన్నాడు. శరత్ మండవ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఇటీవలే స్పెయిన్‌లో రెండు పాటల చిత్రీకరణతో సినిమా షూటింగ్ మొత్తం పూర్తయింది. అయితే తాజాగా ఈ చిత్రంలోని ఫస్ట్ సింగిల్ లిరికల్ వీడియోను మేకర్స్ తాజాగా విడుదల చేశారు.
‘తూలే గిరగిర మని బుర్రె ఇట్టా.. తేలిందా నెలవంత అడుగుల వెంట’ అంటూ సాగే ఈ పాట శ్రోతలను ఆకట్టుకుంటుంది. సిద్ శ్రీరామ్ తన వాయిస్‌తో మళ్ళీ ఫిదా చేశాడు. రాకెందు మౌళి సాహిత్యం క్యాచీగా కొత్త కొత్త పదాలతో అద్భుతంగా ఉంది. సామ్ సీఎస్ సంగీతం ఫీల్గుడ్లా గాల్లో తేలిపోతున్నట్లుగా ఉంది. ప్రస్తుతం ఈ లిరికల్ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో రవితేజ రెవెన్యూ డివిజన్ ఆఫీసర్‌గా నటిస్తున్నాడు. రవితేజకు జోడిగా దివ్యాంశ కౌషిక్, రాజిషా విజయన్ కథానాయికులుగా నటించారు. చాలా కాలం తర్వాత సీనియర్ హీరో వేణు తోట్టెంపూడి ఈ చిత్రంలో కీలకపాత్రలో నటిస్తున్నాడు. శ్రీ లక్ష్మివెంకటేశ్వరా సినిమాస్, ఆర్టి టీమ్ వర్క్స్ బ్యానర్లపై సుధాకర్ చెరుకూరితో కలిసి రవితేజ స్వీయ నిర్మాణంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని జూన్ 17న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.