Kajal Aggarwal | సినిమాలకు కాజల్ గుడ్‌బై.. మళ్లీ తల్లి కాబోతుందా?
Kajal Aggarwal | కాజల్ మళ్లీ తల్లి కాబోతుందా? అంటే అవుననే సోషల్ మీడియా కోడై కూస్తోంది. పెండ్లి చేసుకుని, ఓ బిడ్డకు జన్మనివ్వడంతో సినిమాలకు కొద్దిరోజులు గ్యాప్ ఇచ్చిన కాజల్.. ఈ మధ్యే తన సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టింది. రెండు భారీ ప్రాజెక్టుల్లో నటిస్తూ మంచి జోరు మీదుంది.
Kajal Aggarwal | కాజల్ మళ్లీ తల్లి కాబోతుందా? అంటే అవుననే సోషల్ మీడియా కోడై కూస్తోంది. పెండ్లి చేసుకుని, ఓ బిడ్డకు జన్మనివ్వడంతో సినిమాలకు కొద్దిరోజులు గ్యాప్ ఇచ్చిన కాజల్.. ఈ మధ్యే తన సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టింది. రెండు భారీ ప్రాజెక్టుల్లో నటిస్తూ మంచి జోరు మీదుంది. ఇలాంటి సమయంలో కాజల్ మళ్లీ గర్భం దాల్చిందనే వార్త ఇప్పుడు వైరల్‌గా మారింది.
లక్ష్మీకల్యాణం సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన కాజల్.. షార్ట్ పీరియడ్‌లోనే స్టార్ హీరోయిన్గా ఎదిగింది. తెలుగు, తమిళ సినిమాల్లో వరుస అవకాశాలతో దూసుకెళ్తున్న సమయంలోనే 2020లో తన చిన్ననాటి స్నేహితుడు, బిజినెస్‌మ్యాన్ గౌతమ్ కిచ్లూని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఆ వెంటనే పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆ తర్వాత కొద్దిరోజులకే సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన కాజల్.. అప్పటికే కమిట్ అయిన సినిమాలను కంప్లీట్ చేసే పనిలో పడింది. ఇందుకోసం వర్కవుట్స్ చేస్తూ మళ్లీ స్లిమ్‌గా మారింది. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సినిమాలో ఇండియన్ 2 షూటింగ్లో బిజీ అయిపోయింది. దీంతో పాటు బాలకృష్ణ, అనిల్ రావిపూడి కాంబినేషన్లో వస్తున్న భగవంత్ కేసరి సినిమాకు కూడా కమిట్ అయ్యింది. ఇలాంటి సమయంలో టాలీవుడ్లో ఒక వార్త వైరల్‌గా మారింది. ఈ రెండు సినిమాలు పూర్తి కాగానే కాజల్ సినిమాలకు గుడ్‌బై చెప్పనుందనే వార్తలు కొద్దిరోజులుగా ఫిలిం ఇండస్ట్రీలో గుప్పుమంటున్నాయి.
కాజల్ మళ్లీ తల్లి కాబోతుందని.. అందుకే సినిమా ఇండస్ట్రీని వదిలేయాలని భావిస్తోందని ప్రచారం జరుగుతోంది. అయితే కాజల్ సన్నిహితులు మాత్రం ఈ వార్తలను ఖండించినట్లు సమాచారం. ఒకవైపు తన బిజినెస్ పనులు చూసుకోవడంతో పాటు.. సినిమాలు చేయడం వల్ల తన కుమారుడి బాధ్యతలు చూసుకోవడానికి సమయం దొరకడం లేదంట. అందుకే కుమారుడి ఆలనపాలన దగ్గరుండి చూసుకోవాలనే ఉద్దేశ్యంతోనే సినిమాల నుంచి గ్యాప్ ఇవ్వనుందని చెప్పినట్లు తెలుస్తోంది.
Read More :
Pawan kalyan | ఓజీలో బాలీవుడ్ రొమాంటిక్ హీరో.. పవన్ కళ్యాణ్ కోసం విలన్‌గా ఎంట్రీ !
Chiranjeevi | 20 ఏండ్ల తర్వాత మళ్లీ అలాంటి సాహసం చేస్తున్న చిరంజీవి?
Shilpa Shetty | శిల్పా శెట్టి నివాసంలో చోరీ : ఇద్దరిని అరెస్ట్ చేసిన ముంబై పోలీసులు
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

