బుధవారం 12 ఆగస్టు 2020
Cinema - Jul 05, 2020 , 09:43:38

నారప్ప నుండి స‌ర్‌ప్రైజింగ్ పోస్ట‌ర్ విడుద‌ల‌

నారప్ప నుండి స‌ర్‌ప్రైజింగ్ పోస్ట‌ర్ విడుద‌ల‌

‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ తర్వాత  హీరో వెంకటేష్‌, దర్శకుడు శ్రీకాంత్‌ అడ్డాల కలయికలో నార‌ప్ప అనే సినిమా తెరకెక్కుతున్న విష‌యం తెలిసిందే.  తమిళ చిత్రం ‘అసురన్‌' ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని సురేష్‌ ప్రొడక్షన్స్‌, వి క్రియేషన్స్‌ పతాకాలపై సురేష్‌బాబు, కలైపులి ఎస్‌ థాను ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.  ప్రతీకార కథాంశంతో   రూపుదిద్దుకుంటున్న‌  ఈ చిత్రంలో  మధ్యవయస్కుడైన వ్యక్తిగా వెంకటేష్‌ కనిపించబోతున్నారు. 

చిత్రంలో ప్రియ‌మ‌ణి కూడా కీల‌క పాత్ర పోషిస్తుండ‌గా, ఆమె ప‌ల్లెటూరి యువ‌త పాత్ర పోషిస్తున్న‌ట్టు తెలుస్తుంది. ఇప్ప‌టికే చిత్రం నుండి వెంక‌టేష్, ప్రియ‌మ‌ణి లుక్స్ విడుద‌ల కాగా, తాజాగా నార‌ప్ప పెద్ద కొడుకు మునిక‌న్నా లుక్ విడుద‌ల చేశారు. మునిక‌న్నా పాత్ర‌లో కార్తీక్ ర‌త్నం న‌టిస్తుండ‌గా, ఆయ‌న బ‌ర్త్ డే సంద‌ర్భంగా పోస్ట‌ర్ విడుద‌ల చేశారు. ఈ పోస్ట‌ర్ ఆక‌ట్టుకుంటుంది. మణిశర్మ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. శ్యామ్‌ కె నాయుడు ఛాయాగ్రహణాన్ని సమకూర్చుతున్నారు. లాక్‌డౌన్ వ‌ల‌న చిత్ర షూటింగ్‌కి తాత్కాలిక బ్రేక్ ప‌డ్డ విష‌యం తెలిసిందే


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డోన్‌లోడ్ చేసుకోండి.

తాజావార్తలు


logo