Multi Starrer | టాలీవుడ్లో మరో ఇంట్రెస్టింగ్ మల్టీస్టారర్‌కు రంగం సిద్ధమవుతోంది. మాస్ మహారాజా రవితేజతో పాటు తన కామెడీ టైమింగ్‌తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న శ్రీ విష్ణు తొలిసారి ఒకే సినిమాలో నటించనున్న సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన తాజా అప్డేట్ ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రానికి ‘వీరాధి వీరులంట’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. అధికారిక ప్రకటన రావాల్సి ఉన్నప్పటికీ, ఈ టైటిల్ ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సినిమా కథ, కామెడీ టోన్‌కు తగ్గట్టుగానే ఈ టైటిల్ ఉంటుందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.
ఈ చిత్రానికి హసిత్ గోలి దర్శకత్వం వహించనున్నారు. ఇప్పటికే శ్రీ విష్ణుతో ‘రాజా రాజా చోర’, ‘స్వాగ్’ వంటి చిత్రాలను తెరకెక్కించిన హసిత్ గోలి.. ఇప్పుడు రవితేజతో కలిసి మరో వినోదభరితమైన కథను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. దీంతో శ్రీ విష్ణు-హసిత్ గోలి కాంబినేషన్లో ఇది హ్యాట్రిక్ మూవీ కానుంది.పూర్తి స్థాయి కామెడీ ఎంటర్టైనర్గా రూపొందనున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై స్టార్ నిర్మాత దిల్ రాజు, ఆయన సోదరుడు శిరీష్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయని సమాచారం.
షూటింగ్‌ను ఈ ఏడాది ఆగస్టులో ప్రారంభించేలా చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది. అలాగే సినిమాను 2027 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే లక్ష్యంతో ప్లానింగ్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. రవితేజ ఎనర్జీ, కామెడీ టైమింగ్‌కు.. శ్రీ విష్ణు సహజమైన హాస్యం తోడైతే ఈ సినిమా వినోదానికి కొత్త నిర్వచనం ఇవ్వడం ఖాయమనే అభిప్రాయం అభిమానుల్లో వ్యక్తమవుతోంది. షూటింగ్ ప్రారంభం కాకముందే ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు నెలకొనడం విశేషం. అయితే సినిమా టైటిల్, విడుదల తేదీతో పాటు నటీనటుల పూర్తి వివరాలపై చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అప్పటి వరకు ‘వీరాధి వీరులంట’ అనే టైటిల్‌తో ఈ క్రేజీ మల్టీస్టారర్ వార్తలు టాలీవుడ్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.