కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలు చేయడంలో ఎప్పుడూ ముందుంటాడు మలయాళ స్టార్ యాక్టర్ దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan). ప్రస్తుతం హను రాఘవపూడి (Hanu Raghavapudi) డైరెక్షన్లో సీతారామమ్ (Sita Ramam) సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా నుంచి ఇంట్రెస్టింగ్ అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. తొలి సాంగ్ ఓ సీత హే రామ ప్రోమో (Oh Sita Hey Rama Promo)ను రిలీజ్ చేశారు మేకర్స్. జవాన్లు కాల్పుల మోతతో షురూ ప్రోమో మొదలైంది.
చివరలో దుల్కర్ ఓ సీసా మూత తీయగా..దానిలో నుంచి బయటకు వస్తున్న సీతాకోకచిలుకలతో..వెళ్లి సీత దగ్గర డ్యాన్స్ నేర్చుకోండి అని చెబుతున్నాడు. ఫుల్ లిరికల్ సాంగ్ రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్టు మేకర్స్ ప్రకటించారు. ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ చిత్రం తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో విడుదల కానుంది. సీతారామమ్ వార్ నేపథ్యంలో సాగే పీరియాడిక్ లవ్‌స్టోరీగా తెరకెక్కుతోంది.
దుల్కర్ సల్మాన్ ఈ చిత్రంలో రామ్ అనే జవాన్‌గా కనిపించనుండగా..బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) అతడికి జోడీగా నటిస్తోంది. ఈ సినిమాకు మరిన్ని వివరాలపై త్వరలోనే క్లారిటీ ఇవ్వనుంది టీం. దుల్కర్ సల్మాన్ మరోవైపు చుప్..రివెంజ్ ఆఫ్ ది ఆర్టిస్ట్ సినిమాతోపాటు కింగ్ ఆఫ్ కోఠ సినిమాలు చేస్తున్నాడు.