పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస పెట్టి సినిమాలు చేస్తున్నాడు. వకీల్ సాబ్ చిత్రంతో రీఎంట్రీ ఇచ్చిన పవన్ ప్రస్తుతం అయ్యప్పనుమ్ కోషియమ్ రీమేక్ తో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రం మలయాళంలో మంచి విజయం సాధించడంతో తెలుగులోను అద్భుత విజయం సాధిస్తుందని మేకర్స్ భావిస్తున్నారు. తెలుగు నేటివిటీకి అనుగుణంగా దర్శకుడు సాగర్ కె చంద్ర మూవీని తెరకెక్కిస్తున్నారు.
ఇంటెన్స్ డ్రామాగా తెరకెక్కుతున్న రీమేక్ చిత్రంలో రానా కూడా నటిస్తున్నాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు అందిస్తున్నారు. కరోనా వలన ఆగిన ఈ చిత్ర షూటింగ్ తిరిగి ప్రారంభం కానుంది. అయితే ఈ సినిమాకు ఏ టైటిల్ పెడతారా అని కొన్నాళ్లుగా చర్చ నడుస్తుంది. తాజాగా ఒక ఇంట్రెస్టింగ్ టైటిల్ ఖరారు చేసినట్టుగా గాసిప్స్ వినిపిస్తున్నాయి. చిత్రానికి “పరశురామ కృష్ణమూర్తి” అనే సాలిడ్ టైటిల్ ను కన్ఫర్మ్ చేసినట్టు తెలుస్తుంది. దీనిపై పూర్తి క్లారిటీ రావలసి ఉంది. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా సితార ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.