షూటింగ్ నుంచి ఉడాయించి..
కమర్షియల్ చిత్రాల్లో నటిస్తే కెరీర్ పరిమితమేనని గుర్తించింది బాలీవుడ్ తార కృతి సనన్. అందుకే నటనకు ఆస్కారమున్న వైవిధ్యమైన చిత్రాల్లో నటిస్తూ పేరు తెచ్చుకుంటున్నది.
కమర్షియల్ చిత్రాల్లో నటిస్తే కెరీర్ పరిమితమేనని గుర్తించింది బాలీవుడ్ తార కృతి సనన్. అందుకే నటనకు ఆస్కారమున్న వైవిధ్యమైన చిత్రాల్లో నటిస్తూ పేరు తెచ్చుకుంటున్నది. ఆమెకు ప్రేక్షకుల ప్రశంసలతో పాటు పురస్కారాలూ దక్కుతున్నాయి. ఆమె ‘మిమి’ సినిమాకు ఇటీవల ‘ఐఫా’ అవార్డు దక్కింది. ఈ సంతోషంలో షూటింగ్స్ నుంచి చిన్న విరామం తీసుకుని విహారానికి వెళ్లింది కృతి. కుటుంబంతో కలిసి విదేశాల్లో పర్యటిస్తున్నది. ప్యారిస్ ఈఫిల్ టవర్, డిస్నీ ల్యాండ్ దగ్గర ఫొటోలు దిగుతూ వాటిని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటున్నది. ఈ ఫొటోలకు ‘బోంజార్’ (ఫ్రెంచ్లో గుడ్ మార్నింగ్) అనే క్యాప్షన్స్ పెట్టి పలకరిస్తున్నది. తీరికలేని షెడ్యూల్స్ నుంచి అప్పుడప్పుడు ఇలా ఎస్కేప్ అవడం ముఖ్యమేనన్నది కృతి ఇచ్చే పరోక్ష సందేశం. ప్రస్తుతం కృతి సనన్ ప్రభాస్తో ‘ఆదిపురుష్’, టైగర్ ష్రాఫ్తో కలిసి ‘గణపథ్’, కార్తీక్ ఆర్యన్ సరసన ‘షెహజాదా’, హారర్ డ్రామా ‘బేడియా’ చిత్రాల్లో నటిస్తున్నది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

