Indra Movie Re Release | మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఇంద్ర సినిమాను రీ రిలీజ్ చేస్తున్నట్లు వైజయంతి మూవీస్ ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమాకు సంబంధించి అడ్వాన్స్ బుకింగ్స్ స్టార్ట్ అయ్యాయి. గత కొన్ని రోజులుగా ఈ సినిమా వాయిదా పడనునట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.
ఈ సినిమా రీ రిలీజ్‌కు వారం ముందు నాలుగు సినిమాలు థియేటర్లలో విడుదల అయిన విషయం తెలిసిందే. ఇందులో మూడు (మిస్టర్ బచ్చన్, తంగలాన్, డబుల్ ఇస్మార్ట్) పెద్ద సినిమాలు ఉన్నాయి. దీంతో ఈ సినిమా విడుదలైన వారం రోజులకే రీ రిలీజ్ ఉండడంతో ఇంద్ర ఎఫెక్ట్ ఈ సినిమాలపై ఉంటుందని ముఖ్యంగా కలెక్షన్లపై ప్రభావం పడే అవకాశం ఉందని మేకర్స్ ఆలోచించినట్లు తెలిసింది. అయితే తెలుగులో విడుదలైన మిస్టర్ బచ్చన్, డబుల్ ఇస్మార్ట్ చిత్రాలు మిక్స్డ్ టాక్ తెచ్చుకోవడంతో ఇంద్ర మూవీ రీ రిలీజ్‌కు లైన్ క్లియర్ అయినట్లు తెలిసింది. ఇందులో భాగంగానే తాజాగా అడ్వాన్స్ బుకింగ్స్ స్టార్ట్ అయ్యాయి. ఈ విషయాన్ని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది.
Bringing back the hysteria of Mega Industry Hit #INDRA to theatres 💥#Indra4K worldwide grand re-release on August 22nd.
Andhra Pradesh and Telangana release by @asiansureshent.Megastar @KChiruTweets @AshwiniDuttCh #BGopal @iamsonalibendre #AarthiAgarwal #ManiSharma… pic.twitter.com/Is4Rh1eFfJ
— Vyjayanthi Movies (@VyjayanthiFilms) August 16, 2024
మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో గుర్తుండిపోయే చిత్రాలలో ఇంద్ర ఒకటి. అప్పటివరకు ఫ్యాక్షన్ సినిమాలు బాస్‌కి సెట్ కావు.. మాస్ కామెడీ సినిమాలకే మాత్రమే సెట్ అవుతాయి అన్న నోళ్లని ఈ సినిమాతో మూయించాడు మెగాస్టార్. దర్శకుడు బి.గోపాల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను వైజయంతి మూవీస్ బ్యానర్‌పై అశ్వనీదత్ నిర్మించగా చిన్ని కృష్ణ కథను రాశాడు. 2002 జూలై 24న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. దాదాపు ఆ రోజుల్లోనే రూ.55 కోట్ల షేర్ వసూలు చేసింది. ఇంద్రలో సోనాలి బింద్రే, ఆర్తి అగర్వాల్ హీరోయిన్స్ గా నటించగా.. ప్రకాశ్ రాజ్ కీలక పాత్రలో నటించాడు. వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్వనీదత్ ఈ సినిమాను నిర్మించాడు.
Also Read..