న్యూఢిల్లీ: బ్రిటీష్ పర్వతారోహకుడు గిన్నిస్ వరల్డ్ రికార్డు(Guinness World Record) క్రియేట్ చేశాడు. 18,753 అడుగుల ఎత్తైన కొండ నుంచి పారాచూట్ ద్వారా కిందకు దూకాడు. ఆ స్కీయింగ్ జంప్ చేసింది 34 ఏళ్ల జాషువా బ్రెగ్మెన్. గతంలో ఫ్రెంచ్ పర్వతారోహకుడు మాథియాస్ గిరార్డ్ 2019లో 14,301 అడుగుల ఎత్తైన పర్వతం నుంచి స్కీయింగ్ జంప్ చేశాడు. ఇప్పుడు ఆ రికార్డును జాషువా బ్రెగ్మెన్ బ్రేక్ చేశాడు.
స్కీయి-బేస్ జంపింగ్ క్రీడలో.. స్కీయింగ్‌తో పాటు బేస్ జంపింగ్ కూడా ఉంటుంది. హిమాలయ పర్వతాలపై స్కీయింగ్ చేసిన జాషువా.. ఈ స్టంట్ కోసం సుమారు రెండు వారాల పాటు ప్రాక్టీస్ చేశాడు. హ్యూమన్ ట్రాఫికింగ్‌పై అవగాహన కల్పించే ఉద్దేశంతో ఈ స్టంట్ చేసినట్లు తెలుస్తోంది. అత్యంత ఎత్తైన ప్రదేశంలో స్కీయింగ్‌కు అనువైన ప్రదేశాన్ని క్రియేట్ చేసేందుకు జాషువా టీమ్ తీవ్రంగా శ్రమించింది.
New record: Highest altitude Ski-BASE jump – 5,716 m (18,753 ft) achieved by Joshua Bregmen (UK) in Solukhum, Nepal ⛷ pic.twitter.com/uJBCt6HIvT
— Guinness World Records (@GWR) August 16, 2024