యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ (Kamal Haasan)-స్టార్ డైరెక్టర్ శంకర్ (Shankar) కాంబినేషన్లో ఇండియన్ 2 ( Indian 2) ప్రాజెక్టు సెట్స్ పైకి వెళ్లినట్టే వెళ్లి నిలిచిపోయిన విషయం తెలిసిందే. డైరెక్టర్‌కు మేకర్స్ కు మధ్య నెలకొన్న బేధాభిప్రాయాల కారణంగా ఈ వ్యవహారం కోర్టు వరకూ కూడా వెళ్లింది. ఆ తర్వాత మేకర్స్, డైరెక్టర్ మధ్య రాజీ కుదిరిందని, మళ్లీ ఇండియన్ 2 పట్టాలెక్కేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని వార్తలు కూడా తెరపైకి వచ్చాయి. కాగా గతేడాది ఇండియన్ 2 సెట్స్ పైకి వెళ్లే విషయంలో సందిగ్ధం నెలకొనగా..కమల్ హాసన్ తన ఫోకస్ అంతా విక్రమ్ (Vikram) సినిమావైపు మళ్లించాడు.
లోకేశ్ కనగరాజ్ డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రం బాక్సాపీస్‌ను కలెక్షన్ల వర్షంతో షేక్ చేసింది. చాలా కాలం తర్వాత కమల్ హాసన్‌ను బాక్సాపీస్ షేర్‌ఖాన్‌గా నిలబెట్టింది. కమల్ హాసన్ సినిమాలకు ఇంకా అదిరిపోయే మార్కెట్ ఉందని విక్రమ్ రుజువు చేసింది. ఈ సినిమా ఇచ్చిన సక్సెస్ ఇండియన్ 2 మేకర్స్ లో ఫుల్ ఎనర్జీ నింపుతోందట. త్వరలోనే మేకర్స్ ఇండియన్ 2 సినిమా చిత్రీకరణ ప్రారంభించేందుకు రెడీ అవుతున్నారన్న వార్త ఇపుడు టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది.
ప్రస్తుతం రాంచరణ్‌తో చేస్తున్న ఆర్సీ 15 ప్రాజెక్టును పూర్తి చేసిన వెంటనే..శంకర్ అండ్ టీం ఇండియన్ 2 చిత్రాన్ని మొదలుపెట్టాలని ప్లాన్ చేస్తున్నట్టు కోలీవుడ్ సర్కిల్ టాక్. పొలిటిలక్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తుండగా..కియారా అద్వానీ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది.
Read Also : Ranveer VS Wild Teaser | బియర్ గిల్స్ తో రణ్ వీర్ సింగ్ సాహసాలు..గూస్ బంప్స్ తెప్పిస్తోన్న టీజర్
Read Also : Anil Ravipudi | గర్జిస్తున్న సింహానికి పుట్టినరోజు శుభాకాంక్షలు..అనిల్ రావిపూడి ట్వీట్ వైరల్
Read Also : Ante Sundaraniki Review | అంటే సుందరానికీ రివ్యూ..