Ranveer VS Wild Teaser | బియర్ గ్రిల్స్ తో రణ్ వీర్ సింగ్ సాహసాలు..గూస్ బంప్స్ తెప్పిస్తోన్న టీజర్
డిస్కవరీ ఛానల్ (Discovery Channel)లో అటవీ ప్రాంతాలు, కొండలు, లోయలు, పర్వతప్రాంతాలు, సముద్రాలు, నదీ తీరాల వెంట ప్రయాణిస్తూ..ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో బియర్ గ్రిల్స్ చేసే సాహసాలు ఒళ్లు గగుర్పొడిచేలా సాగుతుంటాయి.
పాపులర్ బ్రిటీష్ అడ్వెంచర్, టీవీ ప్రజెంటర్ బియర్ గ్రిల్స్ (Bear Grylls) డిస్కవరీ ఛానల్ (Discovery Channel)లో హోస్ట్‌గా కనిపించే మ్యాన్ వర్సెస్ వైల్డ్ గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అటవీ ప్రాంతాలు, కొండలు, లోయలు, పర్వతప్రాంతాలు, సముద్రాలు, నదీ తీరాల వెంట ప్రయాణిస్తూ..ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో బియర్ గ్రిల్స్ చేసే సాహసాలు ఒళ్లు గగుర్పొడిచేలా సాగుతుంటాయి.
ఇప్పటికే ప్రధాని నరేంద్రమోదీ, బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్, తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్‌తో బియర్ గ్రిల్స్ చేసిన సాహసాలకు సంబంధించిన ఎపిసోడ్స్ అందరికీ గూస్ బంప్స్ తెప్పించిన విషయం తెలిసిందే. ఈ అడ్వెంచరిస్ట్ ఇపుడు మరో స్టార్ హీరోతో సాహస యాత్రను చేశాడు. బాలీవుడ్ యాక్టర్ రణ్ వీర్ సింగ్ (Ranveer Singh)తో చేసిన (Ranveer VS Wild Teaser) ఒకటి ఇపుడు నెట్టింట్లో ట్రెండింగ్ అవుతోంది.
జంగిల్ మే మంగళ్..రణ్వీర్ వర్సెస్ వైల్డ్.. రణ్వీర్ సింగ్‌తో థ్రిల్లింగ్ కలిగించే సాహసవిన్యాసాలతో కూడిన ఇంటరాక్టివ్ స్పెషల్ త్వరలో రాబోతోంది..అంటూ నెట్ఫిక్స్ ఎపిసోడ్ అఫీషియల్ టీజర్‌ను షేర్ చేసింది. జులై 8న నెట్‌ఫ్లిక్స్ లో ఈ ఎపిసోడ్ ప్రీమియర్ కాబోతుందని టీజర్లో చెప్పారు మేకర్స్. రణ్ వీర్ సింగ్‌ను ఎలుగు బంటితో ఎలాంటి సాహసాలు చేశాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

