Ante Sundaraniki Review | అంటే సుందరానికీ రివ్యూ..
నాని, నజ్రియా నజీమ్ జంటగా దర్శకుడు వివేక్ ఆత్రేయ ‘అంటే సుందరానికి’ (Ante Sundaraniki) చిత్రాన్ని రూపొందించారు. నాని సినిమాల్లో సహజంగానే బలమైన కథా కథనాలు, కొత్త నేపథ్యం ఉంటాయని ఆశిస్తుంటారు ప్రేక్షకులు. దర్శకుడిగా వివేక్ ఆత్రేయ ప్రతిభ మీదా అంచనాలు ఉన్నాయి.
నటీనటులు– నాని (Nani), నజ్రియా నజీమ్ (Nazriya) , అనుపమా పరమేశ్వరన్, నరేష్, రోషిణి, నదియా, అజఘం పెరుమాల్, హర్షవర్థన్, రాహుల్ రామకృష్ణ, శ్రీకాంత్ అయ్యంగార్ తదితరులు
సాంకేతిక నిపుణులు – ఎడిటింగ్ – రవితేజ గిరిజాల, సినిమాటోగ్రఫీ – నికేత్ బొమ్మి, సంగీతం – వివేక్ సాగర్, నిర్మాణ సంస్థ – మైత్రీ మూవీ మేకర్స్, నిర్మాతలు – నవీన్ యెర్నేని, వై రవి శంకర్, రచన దర్శకత్వం – వివేక్ ఆత్రేయ (Vivek Athreya).
యాక్షన్ సినిమాలు ఎక్కువగా చూసిన ఈ సీజన్ లో కామెడీ పంచేందుకు వచ్చిన మరో ఎంటర్ టైనర్ అంటే సుందరానికీ. నాని, నజ్రియా నజీమ్ జంటగా దర్శకుడు వివేక్ ఆత్రేయ ఈ చిత్రాన్ని రూపొందించారు. నాని సినిమాల్లో సహజంగానే బలమైన కథా కథనాలు, కొత్త నేపథ్యం ఉంటాయని ఆశిస్తుంటారు ప్రేక్షకులు. దర్శకుడిగా వివేక్ ఆత్రేయ ప్రతిభ మీదా అంచనాలు ఉన్నాయి. నాని ఎంపిక, వివేక్ పనితనం అంటే సుందరానికీ సినిమాకు ఏ స్థాయి విజయాన్ని అందించాయో రివ్యూలో చూద్దాం.
కథేంటంటే..
బ్రాహ్మణ యువకుడు సుందర్ (నాని) కుటుంబపు ఆచారాలతో విసిగిపోతుంటాడు. లీల (నజ్రియా నజీమ్)ను చిన్నప్పటి నుండి ప్రేమిస్తుంటాడు. ఆమె క్రిస్టియన్. ఈ ఇద్దరూ ఒకే స్కూల్ లో చదువుకుంటారు. ప్రపంచానికి కనిపించే సుందర్ లోపాలన్నీ లీలకు పట్టవు. ఆమెకు అతను ఎలా ఉన్నా ఇష్టమే. అతను పైకి అందరి ముందూ అమాయకంగా కనిపించినా, ప్లాన్స్ వేయడంలో ముదురు. లీల తనకంటూ గుర్తింపు ఉండాలని కోరుకునే అమ్మాయి. ఫొటోగ్రాఫీ కెరీర్ ఎంచుకుంటుంది. సుందర్ తండ్రి శాస్త్రి (నరేష్), లీల తండ్రి థామస్ (అజఘం పెరుమాల్)కు మరో మతం వాసనే గిట్టదు. భిన్న ధృవాల్లాంటి కుటుంబ నేపథ్యాలు, కుటుంబ సభ్యులు, మతాచారాలు మధ్య ప్రేమికులుగా సుందర్, లీలా ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు? వాళ్ల ప్రేమను దక్కించుకునేందుకు ఎలాంటి ప్లాన్స్ వేశారు?. చివరికి ఎలా ఒక్కటయ్యారు? అనేది మిగిలిన కథ.

ఫ్లస్ పాయింట్స్..
నాని, నజ్రియా నటన
సంభాషణలు
నవ్వించే సన్నివేశాలు
మైనస్ పాయింట్స్..
నెమ్మదించిన ప్రథమార్థం
సంగీతం
ఎలా ఉందంటే.
హీరోయిజం లక్షణాలకు దూరంగా కథలు ఎంచుకుంటూ మన మధ్య తిరిగే కుర్రాడిలా తెరపై కనిపించడమే హీరోగా నాని విజయసూత్రం. ఈ సినిమాకూ అదే నమ్ముకున్నారాయన. ఒక జంట మధ్య, రెండు భిన్న కుటుంబాల మధ్య ఒక కథను ఎంచుకుని దాన్ని సాధ్యమైనంత సహజంగా ఉండేలా చూసుకున్నారు. దీంతో సినిమా ఆద్యంతం ఆహ్లాదకరంగా సాగుతుంటుంది. సుందర్ పాత్రను ప్రారంభం నుంచి అమాయకంగా చూపించిన దర్శకుడు వివేక్…ఆ పాత్ర ప్రవర్తనకు నేపథ్యం చూపిస్తూ నవ్వించాడు. ప్రేమ కోసం సుందర్ తన చుట్టూ ఉన్న పాత్రలను ఉపయోగించుకోవడం, అందుకు అతను చెప్పే అబద్ధాలు వినోదాన్ని పండించాయి. దీనికి తోడు ఇంట్లో సంప్రదాయాల చాదస్తంతో అతను పడే ఇబ్బందులూ హ్యూమర్ క్రియేట్ చేశాయి.
సుందర్ పాత్రలో నాని నటన సినిమా మొత్తానికీ ఆధారమయ్యింది. నరేష్ తో నాని సీన్స్ అన్నీ బాగున్నాయి. ఎవరి కోణంలో వాళ్ల ఫ్రస్టేషన్ చూపిస్తుంటారు. లీలది మరో ప్రపంచం, సుందర్ లాగే తనకూ ఇంట్లో ఇబ్బందులు ఉంటాయి. లీల పాత్రలో నజ్రియా నటన మెప్పిస్తుంది. ఆమె ఒక నాయిక అనిపించదు..ఆ పాత్రలాగే మారిపోయింది. తండ్రి పాత్రల్లో నరేష్, అజఘం పెరుమాల్ పర్పెక్ట్ కాస్టింగ్. నాని బాస్ పాత్రలో హర్షవర్థన్ కూడా ఉన్నంత సేపూ నవ్వించాడు.

ప్రథమార్థంలో లీల, సుందర్ నేపథ్యాలు చూపిస్తూ కథను ప్రారంభించాడు దర్శకుడు. ఈ రెండు పాత్రల స్వభావాలను విపులంగా చూపించడంతో కథనం నెమ్మదించింది. అయితే ఆ ఎపిసోడ్స్ పూర్తయ్యాక మళ్లీ స్క్రీన్ ప్లే వేగం పెరిగింది. ద్వితీయార్థం సాగుతూ ప్రీ క్లైమాక్స్ వచ్చే సరికి కథ దర్శకుడు కోరుకున్నంత రక్తి కట్టింది. సినిమా ముగింపు ముందొచ్చే సన్నివేశాలన్నీ హిలేరియస్ గా ఉంటాయి. దర్శకుడిగా వివేక్ ఆత్రేయ ప్రతిభ మరోసారి కనిపించింది. నేపథ్య సంగీతం ప్లెజంట్ గా ఉన్నా పాటలు అంత వినసొంపుగా లేవు. పాటలకు ఎక్కువగా ఆస్కారం లేని కథ ఇది. ఉన్నంతలో పాటలు ఇంకా బాగా చేసి ఉండాల్సింది. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్, ప్రొడక్షన్ వ్యాల్యూస్ బాగున్నాయి.
చివరగా..అంటే…ఇది సుందర్ లీలా వినోదం
రేటింగ్ : 3/5
Read Today's Latest Reviews News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
France Protests | ఫ్రాన్స్ అగ్నిగుండం.. భవనాలకు నిప్పు, దుకాణాలు లూటీ.. హింసాత్మకంగా మారిన నిరసనలు
Russia-Ukraine War | రష్యాపై వెయ్యి డ్రోన్లతో ఉక్రెయిన్ దాడి.. భారీగా మంటలు
Prakash Raj | 23న దేశవ్యాప్తంగా ప్రజామార్చ్.. ‘పీపుల్ అగైనెస్ట్ సర్’ కూటమి పిలుపు
SIR | ప్రపంచమంతా ‘జంతర్ మంతర్’! సర్‌కు వ్యతిరేకంగా అనేక దేశాల్లో ప్రవాస భారతీయుల నిరసనలు
India vs Zimbabwe T20I | అమ్మాయిలు అదుర్స్.. దంచికొట్టిన షెఫాలీ, మంధాన.. రెండో టీ20లో భారత్ ఘన విజయం
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

