Siddharth | కమల్ హాసన్ (Kamal Haasan) నటిస్తోన్న తాజా ప్రాజెక్ట్ ఇండియన్ 2. లైకా ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తోంది. శంకర్ (Shankar) డైరెక్షన్లో అత్యంత భారీ బడ్జెట్‌తో లైకా ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తోంది. కాగా ఇండియన్ 2లో బొమ్మరిల్లు హీరో సిద్దార్థ్ (Siddharth) వన్ ఆఫ్ ది కీ రోల్లో నటిస్తున్నాడని తెలిసిందే. ఇవాళ పుట్టినరోజు జరుపుకుంటున్న సిద్దార్థ్‌కు ఇండియన్ 2 (Indian 2)టీం శుభాకాంక్షలు తెలియజేసింది. లైకా ప్రొడక్షన్స్ విషెస్ అందిస్తూ సిద్దార్థ్ లుక్ ఒకటి షేర్ చేసింది. ఈ స్టిల్ ఇప్పుడు నెట్టింట్లో ట్రెండింగ్ అవుతోంది.
కొన్ని రోజుల క్రితం విదేశీ యాక్షన్ అండ్ స్టంట్ డిజైనింగ్ టీంతో కమల్ హాసన్ జాయిన్ అయిన ఫొటోలు ఇప్పటికే నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. మరోవైపు తైవాన్‌లోని అందమైన లొకేషన్లో ఇండియన్ 2 షూటింగ్ స్టిల్స్, వీడియోలతోపాటు సౌతాఫ్రికా షెడ్యూల్‌కు సంబంధించిన అప్డేట్ కూడా ఇటీవలే బయటకు వచ్చింది. మొత్తానికి బ్యాక్ టు బ్యాక్ షెడ్యూల్స్‌తో ఇండియన్ 2ను వీలైనంత త్వరగా పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నాడు శంకర్.
ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తుండగా.. బాబీ సింహా, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవానీ శంకర్, సముద్రఖని ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇండియన్ 2 చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్-రెడ్ జియాంట్ మూవీస్ బ్యానర్లపై ఉదయనిధి స్టాలిన్-సుభాస్కరన్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు.
సిద్దార్థ్‌కు బర్త్ డే విషెస్..
Team #INDIAN2 🇮🇳 wishes Mr. Charming & multi talented #Siddharth 🤩 a Happy B’day 🥳 & a fabulous year ahead ✨
🌟 @ikamalhaasan 🎬 @shankarshanmugh 🪙 @LycaProductions @RedGiantMovies_ 🎶 @anirudhofficial 🌟 #Siddharth @MsKajalAggarwal @Rakulpreet @priya_Bshankar #BobbySimha 📽️… pic.twitter.com/VkBQ5SJ3nr
— Lyca Productions (@LycaProductions) April 17, 2023
Read Also :
Mark Antony | మార్క్ ఆంటోనీ సెట్స్‌లో ఎస్జే సూర్య, విశాల్ సెలబ్రేషన్స్.. వీడియో వైరల్
Agent | యాక్షన్ అవతార్‌లో మమ్ముట్టి.. ఏజెంట్ స్టన్నింగ్ లుక్
Dhruva Natchathiram | విక్రమ్ అభిమానులకు గుడ్‌న్యూస్.. ధ్రువ నక్షత్రం ఫస్ట్ లుక్