మహేష్ యడ్లపల్లి, స్వాతి, యశ్వంత్ పెండ్యాల తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘స్వ’. జీఎంఎస్ గాలరీ ఫిల్మ్స్ పతాకంపై జీఎం సురేష్ ఈ చిత్రాన్ని నిర్మించారు. మను పి వి దర్శకుడు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న స్వ సినిమా ఫిబ్రవరి 4న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. ‘ప్రేమ పయనానికి అందమైన దృశ్యరూపంలా ఉంటుంది. ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి అయ్యాయి. ఫిబ్రవరి 4న థియేటర్లలో సినిమాను విడుదల చేస్తున్నాం. మీ అందరకీ మా సినిమా నచ్చుతుందని ఆశిస్తున్నాం’ అన్నారు నిర్మాత జీఎం సురేష్.