Naanu Matthu Gunda 2 Dog Dubbing | ఈ మధ్య కన్నడ సినిమాలకు డిమాండ్ గట్టిగా ఉన్న విషయం తెలిసిందే. కేజీఎఫ్ సినిమా ఎప్పుడు వచ్చిందో కానీ అప్పటినుంచి కన్నడ సినిమాలు గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద సునామి సృష్టిస్తున్నాయి. ఇక కేజీఎఫ్ తర్వాత వచ్చిన చార్లీ, కాంతార, సప్త సాగరాలు దాటి లాంటి సినిమాలు ప్రేక్షకులను కన్నడవైపు చూపు తిప్పుకునేలా చేశాయి. అయితే తాజాగా కన్నడ ఇండస్ట్రీ నుంచి మరోసారి వార్తల్లో నిలిచింది. ఇందుకు కారణం ఓ మూవీ దర్శకుడు తన సినిమా కోసం ఏకంగా కుక్కతో డబ్బింగ్ చెప్పించారు.
2020లో వచ్చిన సూపర్ హిట్ చిత్రం నాను మత్తు గుండా(Naanu Matthu Gunda) ఒక డ్రైవర్, గుండా అనే అనాథ కుక్కని తెచ్చుకుని పెంచుకోవడం. దానీ వలన ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోన్నాడు అనేది ఈ సినిమా స్టోరీ. కామెడీ అండ్ ఎమోషనల్ జానర్లో వచ్చిన ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. అయితే ఈ సినిమాకు 4 సంవత్సరాల తర్వాత సీక్వెల్ అనౌన్స్ చేశారు మేకర్స్. నాను మత్తు గుండా 2 (Naanu Matthu Gunda 2) అంటూ ఈ సినిమా రానుండగా.. షూటింగ్ కూడా కంప్లీట్ చేసుకుంది ఈ చిత్రం. రీసెంట్గా ఈ మూవీ పనులు మొదలుపెట్టిన చిత్రబృందం సరికొత్త ట్రెండ్‌ను సెట్ చేసింది.
ఈ సినిమాలో డాగ్ రోల్‌కి ఆ కుక్కతోనే డబ్బింగ్ చెప్పించింది చిత్రయూనిట్. ఈ మూవీలో లబ్రాడర్ బ్రీడ్‌కి చెందిన సింబా అనే డాగ్ ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించిందని.. అందులో వచ్చే ఎమోషనల్ సీన్స్‌లో సహజత్వం కోసం కుక్కతోనే డబ్బింగ్ చెప్పించినట్లు చిత్రబృందం వెల్లడించింది. ఇక ఈ సినిమాను పాన్ ఇండియా లెవల్లో విడుదల చేయనుండగా.. తెలుగులో నేను నా నేస్తం అనే పేరుతో విడుదల కాబోతుంది. రాకేష్ అడిగా కథానాయకుడిగా నటిస్తున్న ఈ సినిమాను రఘు హాసన్ దర్శకత్వం వహిస్తుండగా.. తెలుగు మ్యూజిక్ డైరెక్టర్ ఆర్పీ పట్నాయక్ సంగీతం అందిస్తున్నాడు.
Also Read..