Chiyaan Vikram | కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ (Chiyaan Vikram) నటిస్తోన్న హిస్టారికల్ డ్రామా తంగలాన్ (Thangalaan). పా రంజిత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మాళవికా మోహనన్, పార్వతి తిరువొత్తు ఫీ మేల్ లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. ఆగస్టు 15న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలవుతోంది. మరో మూడు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానున్ననేపథ్యంలో ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది విక్రమ్ టీం.
తెలుగు ప్రమోషన్స్‌లో భాగంగా ఇవాళ విజయవాడలో సందడి చేసింది తంగలాన్ చిత్రయూనిట్. పాపులర్ బాబాయ్ హోటల్లో విక్రమ్, మాళవికా మోహనన్, ఇంగ్లీష్ నటుడు డానియల్ కల్టగిరోన్ బ్రేక్ ఫాస్ట్ చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ (కేజీఎఫ్)లో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పశుపతి, డానియెల్ కల్టగిరోన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
18వ శతాబ్దం-19వ శతాబ్దం మధ్య కేజీఎఫ్ బ్యాక్‌డ్రాప్‌లో బంగారం, రక్తం, కన్నీటి చుట్టూ తిరిగే స్టోరీతో సాగే అడ్వెంచరస్ డ్రామా నేపథ్యంలో తంగలాన్ ఉండబోతుందని గ్లింప్స్, ఫస్ట్ లుక్ పోస్టర్లు క్లారిటీ ఇచ్చేస్తున్నాయి. ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్, నీలమ్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై కేఈ జ్ఞానవేళ్ రాజా తెరకెక్కిస్తున్నారు. జీవీ ప్రకాశ్ కుమార్ మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు.
Our @chiyaan @MalavikaM_ & @DanCaltagirone were spotted at the popular Babai Hotel in Vijaywada for breakfast! 🤗#ChiyaanVikram 🌟#ThangalaanFromAug15@sooriaruna @Kalaiazhagan15 @mugeshsharmaa @proyuvraaj pic.twitter.com/pTI8hwzGdQ
— Chiyaan Vikram Fans (@chiyaanCVF) August 12, 2024
Gabbar Singh 4K | గబ్బర్ సింగ్‌తో అదే ట్రెండ్ సెట్ చేయబోతున్న పవన్ కల్యాణ్..!
Kanguva Trailer | సూర్య, బాబీడియోల్ రౌద్రరూపం.. గూస్బంప్స్ తెప్పిస్తోన్న కంగువ ట్రైలర్
Abhishek Bachchan | ఐశ్వర్యారాయ్‌తో విడాకులు.. అభిషేక్ బచ్చన్ రియాక్షన్ ఇదే…!