Prabhas Fauji | ‘సలార్’, ‘కల్కి’ వంటి బ్లాక్ బస్టర్ సినిమాలతో జోష్ మీదున్న ప్రభాస్ తాజాగా మరో సినిమాను ప్రారంభించిన విషయం తెలిసిందే. సీతారామం, అందాల రాక్షసి చిత్రాల ఫేమ్ హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్‌ను చేయబోతున్నాడు. వార్ బ్యాక్‌డ్రాప్‌లో ప్రీ ఇండిపెండెన్స్ కథతో ఈ సినిమా రాబోతుంది. అయితే ఈ సినిమాలో కొత్త హీరోయిన్ను ఇండస్ట్రీకి తీసుకురాబోతున్నాడు హను రాఘవపూడి. ఇప్పటికే సీతారామం సినిమాతో మృణాల్ ఠాకుర్‌ను టాలీవుడ్‌కు పరిచయం చేసిన హను తాజాగా (ఇమాన్ ఎస్మాయిల్) ఇమాన్వీ అనే భామను పరిచయం చేయబోతున్నాడు.
ప్రభాస్‌కు జోడిగా ఇమాన్ ఎస్మాయిల్ నటిస్తుండటంతో ఆమె ఎవరు అని ప్రభాస్ అభిమానులతో పాటు నెటిజన్లు తెగ వెతుకుతున్నారు. పాకిస్థాన్ మూలాలు ఉన్న ఈ భామ దేశ రాజధాని ఢిల్లీలో సెటిల్ అయింది. ఇమాన్వీ మంచి డ్యాన్సర్ కూడా. ఆమె చేసిన ఒక వీడియో అప్పట్లో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. అయితే ఇమాన్వీ నటనను చూసి హను ఎంపిక చేసినట్లు తెలుస్తుంది. సుభాష్ చంద్రబోస్ పాలనలో జరిగే పీరియాడికల్ డ్రామా, అని ఈ ప్రేమకథలో ప్రభాస్ ఆర్మీ మేన్‌గా కనిపించనున్నాడని అంటున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని భారీ ఎత్తున నిర్మించనున్నారు. ఇందుకోసం రామోజీ ఫిల్మీ సిటీలో భారీ సెట్‌ను కూడా నిర్మిస్తున్నారు. ఈ సెట్లోనే ఎక్కువ భాగం షూటింగ్ జరగనుంది. సీనియర్ నటులు మిథున్ చక్రవర్తి, జయప్రద కీలక పాత్రల్లో నటించనున్నారు.
ఈ చిత్రానికి కెమెరా: సుధీప్ ఛటర్జీ, సంగీతం: విశాల్‌చంద్రశేఖర్, ప్రొడక్షన్ డిజైనర్: రామకృష్ణ-మోనిక, వీఎఫ్ఎక్స్: కమల్ కన్నన్, రచన-దర్శకత్వం: హను రాఘవపూడి.
Finally my fav talented youtuber did #KurchiMadathapetti video 🤤 pic.twitter.com/GyXumI8ahB
— Nandu (@devd_dhfm) February 18, 2024
Iman Esmail… The new heroine. The same #Imanvi of #PrabhasHanu latest film!
She’s not only stunningly beautiful but also a scintillating dancer and choreographer from Delhi.#Prabhas #PrabhasHanuBegins pic.twitter.com/xNHhQIPAhs
— Manohar Chimmani (@MChimmani) August 17, 2024
Iman Esmail 🌺😍🥰
📸#ImanEsmail pic.twitter.com/oQ46UOWVfb— INDIAN ACTRESS (@Amritha0005) August 18, 2024
Also Read..