Pa Ranjith | తమిళ దర్శకుడు పా.రంజిత్ సినిమాల గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. కబాలి, కాలా, సర్పాట్టా పరంబరై వంటి సినిమాలతో తనకంటూ మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. రీసెంట్గా అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చి మరో హిట్‌ను అందుకున్నాడు ఈ దర్శకుడు.
అయితే పా. రంజిత్ సినిమాలలో ఎంటర్టైనమెంట్ కంటే సామాజిక సమస్యలు, అంటరానితనం, మనుషుల ఆలోచన విధానంపై ఎక్కువ స్కోప్ ఉంటుంది. అతడి తీసే సినిమాలలో ఎక్కడో ఒక దగ్గర మనుషులను ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యలను సినిమాటిక్‌గా చూపిస్తూ ప్రశంసలతో పాటు విమర్శలు అందుకొంటుంటాడు. అయితే ‘తంగలాన్’ సక్సెస్ అయిన సందర్భంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గోన్న రంజిత్ సినిమా విషయంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
ఒక ఇంటర్వ్యూలో పా. రంజిత్ మాట్లాడుతూ.. నేను ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడానికి సినిమాలు తీయట్లేదు. నా సినిమాలతో వారిని జ్ఞానోదయం చేయడానికి సినిమాలు తీస్తున్నాను. భారతదేశంలోని కుల వ్యవస్థతో నాకు సమస్య ఉంది. ప్రజలు ఇప్పటికీ కుల విభజనలతో ఇరుక్కుపోయారు. అది అంతం అయ్యే వరకు సినిమాలు తీస్తునే ఉంటాను అంటూ పా. రంజిత్ చెప్పుకోచ్చాడు.
Also Read..