సూపర్రాజా స్వీయ దర్శకత్వంలో నటించి, నిర్మించిన చిత్రం ‘ఇలాంటి సినిమా మీరెప్పుడు చూసుండరు’. ప్రపంచ సినీచరిత్రలో ఒకే షాట్లో సినిమా మొత్తాన్నీ తెరకెక్కించి రికార్డు సృష్టించినట్టు దర్శక, నిర్మాత సూపర్రాజా తెలిపారు. ఈ నెల 19న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా ప్రీరిలీజ్ ఈవెంట్ హైదరాబాద్లో ఘనంగా జరిగింది.
మైత్రీవారు ఈ చిత్రాన్ని రిలీజ్ చేయడం ఆనందంగా ఉందని, విభిన్నమైన కథ, కథనాలతో రూపొందిన ఈ చిత్రం తప్పకుండా అందరికీ నచ్చుతుంది సూపర్రాజా చెప్పారు. ఈ సినిమాలో భాగం అయినందుకు కథానాయిక చందన పాలంకి ఆనందం వెలిబుచ్చారు. వంశీ గోనె, రమ్యప్రియ ఇతర పాత్రలు పోషించిన ఈ చిత్రానికి సంగీతం: సిద్ధార్థ్ శివదాసని, సబు వర్గీస్, నిర్మాణం: రాజా కృష్ణ ప్రొడక్షన్స్.