Itlu Mee Yedava | యంగ్ హీరో త్రినాథ్ కఠారి కథానాయకుడిగా నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్న యూత్‌ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘ఇట్లు మీ ఎదవ’ నవంబర్ 21న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. సంజీవని ప్రొడక్షన్స్ బ్యానర్‌పై బళ్లారి శంకర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా విడుదలకు రెండు ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థలు జతకట్టాయి. నైజాం (Nizam) ప్రాంతంలో మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ LLP విడుదల చేస్తుండగా, ఆంధ్ర (Andhra) మరియు సీడెడ్ (Ceeded) ప్రాంతాలలో ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ రిలీజ్ చేయనుంది. ఈ రెండు దిగ్గజ సంస్థల భాగస్వామ్యంతో ‘ఇట్లు మీ ఎదవ’ సినిమాకు భారీ రిలీజ్ దక్కుతోంది.
‘వెయ్యేళ్ళు ధర్మంగా వర్ధిల్లు’ అనే ఆసక్తికరమైన ట్యాగ్‌లైన్‌తో వస్తున్న ఈ సినిమా ట్రైలర్ ఇప్పటికే విడుదలై మంచి స్పందనను రాబట్టుకుంది. దీంతో ఈ యూత్‌ఫుల్ ఎంటర్టైనర్పై ప్రేక్షకులలో అంచనాలు మరింత పెరిగాయి. హీరోయిన్గా సాహితీ అవాంచ నటిస్తుండగా, దిగ్గజ నటులు తనికెళ్ల భరణి, గోపరాజు రమణ, దేవీ ప్రసాద్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. వీరితో పాటు నవీన్ నేని, తాగుబోతు రమేష్, చలాకీ చంటి, జబర్దస్త్ నూకరాజు వంటి ప్రముఖ నటులు నటించారు. ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్.పి. పట్నాయక్ సంగీతం అందించారు. జగదీష్ చీకటి సినిమాటోగ్రఫీ, ఉద్ధవ్ ఎస్బీ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించారు.
టెక్నికల్ టీం
రచన, దర్శకత్వం: త్రినాధ్ కటారి
నిర్మాత: బళ్లారి శంకర్
బ్యానర్: సంజీవని ప్రొడక్షన్స్
డీవోపీ: జగదీష్ చీకటి
సంగీతం: R P పట్నాయక్
ఎడిటర్: ఉద్ధవ్ SB
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: మల్లికార్జున్
లైన్ ప్రొడ్యూసర్: బృంధావన్ కేతిరెడ్డి
కాస్ట్యూమ్ డిజైనర్: బృందావర్ధని అవ్వారు
పీఆర్వో: తేజస్వి సజ్జా