Varanasi Movie | దిగ్గజ దర్శకుడు రాజమౌళి – సూపర్ స్టార్ మహేశ్ బాబు కాంబినేషన్లో రాబోతున్న తాజా చిత్రం ‘వారణాసి’. ఇన్నిరోజులు ఎస్ఎస్ఎంబీ29, గ్లోబ్ ట్రాటర్ అనే వర్కింగ్ టైటిల్స్‌తో పిలుచుకున్న ఈ చిత్రం తాజాగా శనివారం టైటిల్ లాంఛ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా జరుపుకుంది. అయితే ఈ టైటిల్ లాంచ్‌తో పాటు మూవీ అనౌన్స్మెంట్ ట్రైలర్‌ను చిత్రబృందం విడుదల చేసిన విషయం తెలిసిందే. వారణాసి వరల్డ్ అంటూ ఈ వీడియోను పంచుకుంది. అయితే ఈ వేడుకలో ట్రైలర్ లాంచ్‌కి ముందు ఎల్ఈడీ తెరలకు సాంకేతిక సమస్య ఏర్పడింది.
దీంతో ఈ విషయాన్ని రాజమౌళి తెలుపుతూ.. నేను మాములుగా దేవుడిని నమ్మను. నాన్న గారు వచ్చి ఇందాక హనుమాన్ వెనకాల ఉంటాడు.. గుండెతట్టి నడిపిస్తాడు అని చెప్పారు.. ఇలా అయిన వెంటనే కోపం వచ్చిందండి …ఇదేనా నడిపించేది అని. మా ఆవిడకి హనుమంతుడు అంటే చాలా చాలా ఇష్టం.. ఫ్రెండ్ లాగా మాట్లాడుతది అతడితో.. మా ఆవిడా మీద కూడా కోపం వచ్చింది… ఏంటి ఇదేనా చేసేది అని.. తాను ముందు రోజు తెరపై డెమో చూద్దామనుకున్నాం. కానీ ఎవరో మాకు తెలియకుండా డ్రోన్ ప్రదర్శించారు. అందుకే డైరెక్ట్‌గా ఈవెంట్లో ప్రదర్శించుదాం అని ఇలా చేస్తే సాంకేతిక సమస్య వచ్చింది. అంటూ రాజమౌళి చెప్పుకోచ్చాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.
Too disappointed with S S Rajamouli sir remarks reg lord hanuman. He maybe an atheist but doing such comments rega god is completely unacceptable. #GlobeTrotter #Varanasi
— Keerthy✨ (@itsmeme1063) November 15, 2025