టాలీవుడ్ యాక్టర్ సత్యదేవ్ నటించిన లేటెస్ట్ మూవీ తిమ్మరుసు. జులై 30న థియేటర్లలో విడుదల కానుంది. మంగళవారం నిర్వహించిన తిమ్మరుసు ప్రీ రిలీజ్ ఈవెంట్కు నాని చీఫ్ గెస్ట్ గా హాజరయ్యాడు. ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ…సత్యదేవ్ పెద్ద స్టార్ అవడం ఖాయమన్నాడు. సత్యదేవ్ పనిని తాను స్పూర్తిగా తీసుకుంటానని, ఆయన సినిమాను కుటుంబసభ్యులతో కలిసి థియేటర్లలో చూసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని అన్నాడు. ఓ సినిమాను సిల్వర్ స్క్రీన్ పై చూడటమనేది అద్బుతమైన అనుభవం. లాక్ డౌన్ కారణంగా చాలా రోజుల నుంచి క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్న ఇండస్ట్రీ జనాలకు సాయం చేసేందుకు అధికార యంత్రాంగం చర్యలు తీసుకోవాలని నాని కోరాడు.
శరన్ కొప్పిశెట్టి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం తిమ్మరుసు. ట్యాక్సీవాలా ఫేం ప్రియాంక జవాల్కర్ హీరోయిన్ గా నటిస్తోంది. తిమ్మరుసు మూవీని ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ ఎస్ ఒరిజనల్ బ్యానర్లపై మహేశ్ కోనేరు, శృజన్ యెరబోలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ గా తెరకెక్కుతుంది.
Straight from the heart & some fantastic words from our Natural Star @NameisNani about theaters.
— Vamsi Kaka (@vamsikaka) July 28, 2021
Full speech : https://t.co/PaDt45MfHz#Thimmarasu #ThimmarusuOnJuly30th #ThimmarusuPreReleaseEvent pic.twitter.com/baDjo9nPsZ
కూడా చదవండి..
అసిస్టెంట్ డైరెక్టర్ గా బిగ్ బాస్ బ్యూటీ
రాజ్ కుంద్రా బెయిల్ తిరస్కరణ..గెహనా వశిష్ఠ్ పై కేసు
షూటింగ్స్ తో ఢిల్లీ భామ బిజీ షెడ్యూల్..!
‘మోస్ట్ హ్యాండ్సమ్ ఏసియన్ మ్యాన్ ’ గా ప్రభాస్
తరుణ్, ఉదయ్కిరణ్తో నన్ను పోల్చొద్దు: వరుణ్ సందేశ్
ప్రియమణి-ముస్తఫారాజ్ వివాహం చెల్లదు..