e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, June 22, 2021
Home News అన్నీ అనుకున్నట్లు జరిగుంటే ఈ రోజే ఆచార్య వచ్చుండేది!

అన్నీ అనుకున్నట్లు జరిగుంటే ఈ రోజే ఆచార్య వచ్చుండేది!

అన్నీ అనుకున్నట్లు జరిగుంటే ఈ రోజే ఆచార్య వచ్చుండేది!

కరోనా కానీ లేకపోయుంటే.. అన్ని పరిస్థితులు మామూలుగా ఉండుంటే.. సెకండ్ వేవ్ ఆగిపోయుంటే.. ఒక్కసారి ఊహించుకోండి ఈ రోజు బాక్సాఫీస్ దగ్గర మోత ఎలా ఉండేదో..? మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఆచార్య సినిమా మే 13న విడుదల చేస్తామని అప్పట్లో నిర్మాతలు ప్రకటించారు. ఆ మే 13 వచ్చేసింది. కానీ ఏం చేస్తాం కరోనా కారణంగా ఆచార్య మాత్రం రాలేదు. దాంతో ఇదంతా లేకపోయుంటే ఎంత బాగున్నో అని మెగాస్టార్ అభిమానులు నిట్టూరుస్తున్నారు. అన్నీ బాగుండుంటే ఈ పాటికి అన్నయ్య బొమ్మ పడుండేది.. మార్నింగ్ షోకు టాక్ అదిరిపోయేది కదా అంటూ కలలు కంటున్నారు.

అన్నీ అనుకున్నట్లు జరిగుంటే ఈ రోజే ఆచార్య వచ్చుండేది!

ఒకటి రెండు కాదు.. మూడేళ్లుగా ఈ చిత్రంతోనే బిజీగా ఉన్నాడు దర్శకుడు కొరటాల శివ. అయినా కూడా ఇంకా షూటింగ్ పూర్తి కాలేదు. అవుతూనే ఉంది. ఈ పాటికే సినిమా కూడా విడుదల కావాల్సి ఉన్నా కూడా మధ్యలో ఎన్నో కారణాలు ఈ సినిమాకు అడ్డు తగులుతూనే ఉన్నాయి. అందులో మేజర్ బ్రేకులు కరోనా కారణంగానే వచ్చాయి. నిజానికి 2020లోనే ఆచార్య షూటింగ్ పూర్తి చేయాలని ప్లాన్ చేశాడు దర్శకుడు కొరటాల శివ. కానీ కరోనా కారణంగా లాక్ డౌన్ విధించడంతో దాదాపు ఏడు నెలలు షూటింగ్‌ అక్కడే పోయింది. మొన్నీమధ్యే మళ్లీ పరిస్థితులు బాగానే ఉన్నాయి కదా అని షూటింగ్ ప్రారంభిస్తే మూడు నెలలు కూడా కాకుండానే మరోసారి కొవిడ్ దాడి మొదలైంది. ఇప్పటి వరకు 80 శాతం పైగానే షూటింగ్ పూర్తి చేశాడు కొరటాల. ఇంకా 15 రోజుల షూటింగ్ మాత్ర‌మే బ్యాలెన్స్ ఉంది.

అన్నీ అనుకున్నట్లు జరిగుంటే ఈ రోజే ఆచార్య వచ్చుండేది!

ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో.. చిరంజీవి వయసు దృష్ట్యా ఆయన బయటికి రావడం దాదాపు అసాధ్యం. 65 ఏళ్ల‌ మెగాస్టార్ ఇప్పుడు కానీ బయటికి వస్తే లేనిపోని తలనొప్పులు కొని తెచ్చుకున్నట్లే అంటున్నారు విశ్లేషకులు. ఎలాగూ అయ్యే లేట్ అయింది వీలున్నపుడే షూటింగ్ పూర్తి చేసి మెల్లగా సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారు మేక‌ర్స్‌. ఈ క్రమంలోనే మిగిలిన 15 రోజుల షెడ్యూల్ జూన్ లోనే పూర్తి చేయాలని చూస్తున్నాడు దర్శకుడు కొరటాల శివ. రామ్ చరణ్ కూడా ఈ షూటింగ్ లో పాల్గొనాల్సి ఉంది. ఆయనపై కూడా కొన్ని సన్నివేశాల చిత్రీకరణ బ్యాలెన్స్ ఉంది. చిరు, చరణ్ కాంబినేషన్ సీన్స్ పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీ అవ్వాలని చూస్తున్నాడు కొరటాల శివ. ప్రస్తుతానికి ఆయన అనుకున్న ప్లాన్ అయితే ఇదే. మరి అది ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్ వార్త‌ల కోసం.. న‌మ‌స్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి

ఇవి కూడా చ‌ద‌వండి..

కోవిడ్ టీకా వేసుకున్న సూపర్ స్టార్ రజినికాంత్

సల్మాన్ ఖాన్ రాధే సినిమాకు పైరసీ దెబ్బ

‘పుష్ప’ రెండు భాగాలు చేయడం వెనక పెద్ద క‌థే ఉంది..!

స‌ల్మాన్ దెబ్బ‌కు జీ5 యాప్ ఢ‌మాల్..!

త‌మిళియ‌న్‌ను పెండ్లి చేసుకుంటా: ర‌ష్మిక‌

అనుష్క న‌యా లుక్ నెట్టింట్లో చ‌క్క‌ర్లు..!

రోజా కూతురు అన్షు మాలిక ఫొటోలు వైర‌ల్‌

బాలీవుడ్ ఆఫర్‌కు నో చెప్పిన‌ సాయి పల్లవి

రాజశేఖర్‌తో గోపీచంద్ మ‌ల్టీస్టార‌ర్‌

డ‌బ్బు కోసం న‌న్ను దారుణంగా మోసం చేశారు : రేణు దేశాయ్

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
అన్నీ అనుకున్నట్లు జరిగుంటే ఈ రోజే ఆచార్య వచ్చుండేది!

ట్రెండింగ్‌

Advertisement