e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, June 22, 2021
Home News రాజశేఖర్‌తో గోపీచంద్ మ‌ల్టీస్టార‌ర్‌

రాజశేఖర్‌తో గోపీచంద్ మ‌ల్టీస్టార‌ర్‌

రాజశేఖర్‌తో గోపీచంద్ మ‌ల్టీస్టార‌ర్‌

సీనియర్ హీరో రాజశేఖర్ మళ్లీ వరుస సినిమాలతో బిజీ అవుతున్నారు. మూడేళ్ల కింద ఈయన నటించిన గరుడవేగ సినిమా కమర్షియల్ గా మంచి విజయం సాధించడంతో సెకండ్ ఇన్నింగ్స్ ఊపందుకుంది. గ‌రుడ వేగ త‌ర్వాత ప్ర‌శాంత్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన క‌ల్కీ సినిమా కూడా యావ‌రేజ్‌గా నిలిచింది. దీంతో ఈ సీనియ‌ర్ హీరో మ‌ళ్లీ బిజీ అవుతున్నాడు. ఈ క్ర‌మంలో రాజ‌శేఖ‌ర్ ఓ మ‌ల్టీస్టార‌ర్ సినిమా చేయ‌బోతున్న‌ట్లు స‌మాచారం. ఇందులో గోపీచంద్‌తో క‌లిసి ఆయ‌న న‌టించ‌బోతున్నాడు.

ఈ సినిమాను గోపీచంద్ కు బాగా కలిసొచ్చిన దర్శకుడు శ్రీవాస్ తెరకెక్కించబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా మొదలయ్యాయి. ఒక ప్రముఖ వ్యాపారవేత్త ఈ మల్టీస్టారర్ ను నిర్మించబోతున్నాడు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక సమాచారం బయటకు రానుంది. ఇందులో రాజశేఖర్, గోపీచంద్ అన్నదమ్ములుగా నటించబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది. హై రేంజ్ ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ సినిమాను శ్రీవాస్ తెరకెక్కించనున్నాడు.

గతంలో గోపీచంద్ తో శ్రీవాస్‌ చేసిన లక్ష్యం, లౌక్యం సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. నిజానికి లౌక్యం తర్వాత గోపిచంద్ కి ఇప్పటివరకు మరో హిట్ లేదు. దాంతో మరోసారి కలిసొచ్చిన దర్శకుడితో సినిమా చేయబోతున్నాడు ఈ హీరో. కరోనా పరిస్థితులు చక్కబడ్డ‌ తర్వాత ఈ మల్టీస్టారర్ సెట్స్ పైకి వెళ్లనుంది. మరి ఇద్దరు యాక్షన్ హీరోలు కలిసి చేయబోయే మల్టీస్టారర్ ఎలా ఉండబోతుందో చూడాలి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్ వార్త‌ల కోసం.. న‌మ‌స్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి

ఇవి కూడా చ‌ద‌వండి..

రోజా కూతురు అన్షు మాలిక ఫొటోలు వైర‌ల్‌

బాలీవుడ్ ఆఫర్‌కు నో చెప్పిన‌ సాయి పల్లవి

డ‌బ్బు కోసం న‌న్ను దారుణంగా మోసం చేశారు : రేణు దేశాయ్

మీ అసాధార‌ణ స‌హ‌కారానికి సాటిలేదు : మ‌హేశ్‌బాబు

ఎన్టీఆర్ ఆరోగ్యంపై అప్‌డేట్ ఇచ్చిన చిరంజీవి

చ‌నిపోయిన‌ట్టు ప్ర‌చారం.. ఖండించిన శ‌క్తిమాన్ న‌టుడు

స‌మంత శీర్షాస‌నం.. వైర‌ల్‌గా మారిన వీడియో

క‌రోనా నుండి కోలుకున్న అల్లు అర్జున్

ఓటీటీలో నితిన్ చిత్రం.. రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన మేక‌ర్స్

క‌రోనాతో నేషనల్ అవార్డ్ గ్రహీత కన్నుమూత

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
రాజశేఖర్‌తో గోపీచంద్ మ‌ల్టీస్టార‌ర్‌

ట్రెండింగ్‌

Advertisement