Ibrahim Ali Khan | బాలీవుడ్ యాక్టర్లు ఇబ్రహీం అలీఖాన్, పాలక్ తివారి డేటింగ్లో ఉన్నారంటూ ఇప్పటికే నెట్టింట చర్చనడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఇద్దరు తాజాగా కెమెరా కంటికి చిక్కి డేటింగ్లో ఉన్నది నిజమేనని హింట్ ఇచ్చేస్తున్నారు. ఈ ఇద్దరూ కలిసి వచ్చారంటే.. వారిని కెమెరాల్లో బంధించడానికి కెమెరామెన్స్ పోటీ పడుతుంటారు. అయితే ఇబ్రహీం అలీఖాన్-పాలక్తో కలిసి ఉన్నపుడు ఈ సారి వారి కంట పడకుండా జాగ్రత్త పడుదామనుకున్నాడు. కానీ వర్కవుట్ అవలేదు.
ఇబ్రహీం అలీఖాన్ ముంబైలోని ఓ మల్టీప్లెక్స్ నుంచి పాలక్తో కలిసి బయటకు వస్తున్న టైంలో అక్కడే ఉన్న మీడియా ప్రతినిధులు వారిని ఫొటోలు తీసేందుకు ప్రయత్నించారు. వారిని గమనించిన ఇబ్రహీం అలీఖాన్ లోపలి నుంచి మెట్లు దిగి డోర్ నుంచి బయటకు వస్తున్న పాలక్ను మీడియా కంట పడకుండా రావొద్దని లోపలికి నెట్టేశాడు.
ఇబ్రహీం అలీఖాన్ హమ్మయ్యా మీడియా నుంచి తప్పించుకున్నాననుకునే లోపే.. అప్పటికే లోపలివైపు కూడా కొంతమంది ఫొటోగ్రాఫర్లు రెడీగా ఉన్నారు. ఇంకేంటి చుట్టూ రౌండప్ చేసేసరికి చేసేదేమి లేక పాలక్ తివారీ లోపలి వైపున్న మెట్లపై నుంచి కిందికి దిగి బయటకు వచ్చేసింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.
Ameerpet Fire Accident | అమీర్పేట్లో భారీ అగ్నిప్రమాదం.. షాపింగ్ మాల్లో ఎగసిపడుతున్న మంటలు
Chiranjeevi | ‘పెద్ది’ విజయంపై చిరంజీవి ఎమోషనల్ ట్వీట్.. చరణ్ కష్టానికి దక్కిన ప్రతిఫలం ఇది..
‘వార్డు సభల్లో ప్రజలు భాగస్వాములు కావాలి’