శుక్రవారం 07 ఆగస్టు 2020
Cinema - Jul 10, 2020 , 14:56:28

గోవాకు చార్టెడ్‌ ఫ్లైట్‌ బుక్‌ చేస్తా: మంచు లక్ష్మి

గోవాకు చార్టెడ్‌ ఫ్లైట్‌ బుక్‌ చేస్తా: మంచు లక్ష్మి

లాక్‌డౌన్‌ సమయంలో చాలా మంది సెలబ్రిటీలు కుటుంబసభ్యులతో సరదా సమయాన్ని ఎంజాయ్‌ చేస్తున్నారు. టాలీవుడ్‌ నటి మంచు లక్ష్మి లాక్‌డౌన్‌ రూల్స్‌ పాటిస్తూనే పలు రకాల యాక్టివిటీస్‌ లో పాల్గొంటుంది. లక్ష్మి మంచు ఇటీవలే ఓ టీవీ ప్రోగ్రామ్‌ను షురూ చేసింది. యాక్టర్‌ రానా, బ్యాడ్మింటన్‌ కోచ్‌ పుల్లెల గోపీచంద్‌,  కాంగ్రెస్‌ నేత శశిథరూర్‌ను ప్రోగ్రామ్‌లో ఇంటర్వ్యూ చేసింది. కరోనా, లాక్‌ డౌన్‌ పరిస్థితుల నేపథ్యంలో ప్రజలకు వివిధ అంశాలపై అవగాహన కల్పించే ఉద్దేశంతో ఈ షో షురూ చేసింది. అయితే కరోనాతో షోను తక్కువ సిబ్బందితో షూట్‌ చేయాల్సి రాగా..ముగ్గురు చేసే పనిని ఒక్కరే చేశారట. సిబ్బంది పీపీఈ కిట్లతో ఉండటం వల్ల కాస్త ఊపిరిపీల్చుకుని షూటింగ్‌ కొనసాగించిదట. అయితే కేసులు పెరుగుతుండటం, ఆంక్షలు ఉండటంతో షూట్‌ సరదాగా అనిపించలేదని భావిస్తున్నట్టు టాక్‌.

ఇక మరోవైపు అక్టోబర్‌ 08న తన పుట్టినరోజును మాత్రం ఎట్టిపరిస్థితుల్లో జరుపుకోవాలనుకున్నట్టు చెప్పింది లక్ష్మి మంచు. నా బర్త్‌ డే కోసం గోవాలోని స్నేహితుల ఇంటికి వెళ్తాను. ఒకవేళ రవాణాపై ఆంక్షలు ఉంటే ప్రత్యేకంగా చార్టెట్‌ విమానం బుక్‌ చేసుకుంటా. అవసరమైతే కొంతమంది స్నేహితులను తీసుకెళ్తా. నా బర్త్‌ డే కోసం గోవా ప్రయాణాన్ని ఏదీ ఆపలేదని లక్ష్మిమంచు చెప్పుకొచ్చినట్టు ప్రస్తుతం ఓ వార్త ఫిలింనగర్‌లో చక్కర్లు కొడుతోంది


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo