Rashmika Mandanna | కన్నడ భామ రష్మిక మందన్నా (Rashmika Mandanna) బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉంది. ఈ భామ నటిస్తోన్న క్రేజీ ప్రాజెక్టుల్లో ఒకటి పుష్ప.. ది రూల్ కాగా.. రెండోది బాలీవుడ్ మూవీ యానిమల్ (Animal) . షూటింగ్ దశలో ఉన్న ఈ రెండు భారీ చిత్రాలపై అంచనాలు భారీగానే ఉన్నాయి. బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్‌కపూర్(Ranbir Kapoor)తో నటిస్తోన్న యానిమల్ చిత్రాన్ని అర్జున్ రెడ్డి ఫేం సందీప్ రెడ్డి వంగా డైరెక్ట్ చేస్తున్నాడు. తాజాగా ఈ సినిమా షూటింగ్ అప్డేట్ అందించింది రష్మిక మందన్నా. యానిమల్కు సంబంధించి తన పోర్షన్ పూర్తయిందని తెలియజేసింది.
నిన్నటి నైట్ షూట్‌తో షూటింగ్ పూర్తయింది. తిరిగి హైదరాబాద్‌కు వచ్చేశా. నేటి నుంచి పుష్ప 2 పనులపై ఫోకస్ పెట్టబోతున్నా. యానిమల్ టీంతో కలిసి పనిచేయడం చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమా హఠాత్తుగా నా వద్దకు వచ్చింది. యానిమల్ కోసం 50 రోజులు షూటింగ్లో పాల్గొన్నా. సందీప్ రెడ్డి వంగా తన క్రాఫ్ట్‌లో లీనమైపోయాడు. ఆర్టిస్టులందరికీ చాలా స్వేచ్చనిచ్చారు. రణ్ భీర్ కపూర్ అందమైన వ్యక్తిత్వం ఉన్న మనిషి. అనిల్ కపూర్‌తో పనిచేయం అద్బుతమైన అనుభవం.. అంటూ ఇన్స్టాగ్రామ్ స్టోరీలో రాసుకొచ్చింది.
ఈ చిత్రాన్ని టీ సిరీస్ ఫిలిమ్స్, భద్రకాళి పిక్చర్స్, సినీ 1 స్టూడియోస్ బ్యానర్లపై భూషణ్ కుమార్, ప్రణయ్ రెడ్డి వంగా, కృషన్ కుమార్, మురద్ ఖేతని నిర్మిస్తున్నారు. సుకుమార్ డైరెక్షన్లో అల్లు అర్జున్ టైటిల్ రోల్ పోషిస్తున్న పుష్ప.. ది రూల్ షూటింగ్ దశలో ఉంది. రష్మిక మందన్నా మరోవైపు లీడ్ రోల్లో రెయిన్ బో చిత్రంలో కూడా నటిస్తోంది. ఈ మూవీ కూడా షూటింగ్ దశలో ఉంది.
షూట్ పూర్తయిన సందర్భంగా టీంతో రష్మిక..
#Animal .. pieces of my heart. ❤️ pic.twitter.com/CRsvMqYHjT
— Rashmika Mandanna (@iamRashmika) June 20, 2023