Samantha | సరోగసి నేపథ్యంలో సమంత ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ చిత్రం ‘యశోద’. హరి-హరీష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం గత వారం ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటీవ్ రివ్యూలను తెచ్చుకుంది. సమంత జరిపిన ప్రమోషన్స్ కూడా సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేశాయి. దాంతో ఈ చిత్రానికి భారీగా ఓపెనింగ్స్ వచ్చాయి. సినిమాలో సమంత పాత్ర, నటనకు సైతం మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ నేపథ్యంలో సినిమా సక్సెన్పై సమంత సంతోషం వ్యక్తం చేసింది. ఇప్పుడు తన మనసు గాల్లో తేలుతున్నట్లుగా ఉందంటూ ట్విట్టర్ ద్వారా తన ఆనందాన్ని వ్యక్త పరిచింది.
‘యశోద సినిమాపై మీరు చూపిస్తున్న ప్రేమ, ఆదరణకు ధన్యవాదాలు. మీ ప్రశంసలు, మద్దతే నాకు లభించిన అతిపెద్ద బహుమతి. సినిమాకు వస్తున్న స్పందన నాకెంతో సంతోషాన్ని ఇస్తోంది. థియేటర్లలో మీ సంబరాలు చూశా. సినిమా ఎలా ఉందో మీరు చెప్పిన మాటలు విన్నా. దీని వెనుక మా చిత్ర బృందం నిర్విరామంగా పడిన కష్టం కనిపిస్తోంది. ఇప్పుడు నా మనసు గాల్లో తేలుతున్నట్టుగా ఉంది. యశోద ప్రాజెక్టులో భాగస్వామ్యం అయిన వాళ్లందరికీ థ్యాంక్స్. నా పైన నమ్మకం ఉంచిన నిర్మాత, శ్రీదేవి మూవీస్ శివలెంక కృష్ణప్రసాద్, దర్శకులు హరి-హరీష్‌కు ప్రత్యేక ధన్యవాదాలు’ అంటూ ట్వీట్ చేసింది.
యశోద చిత్రంలో చిత్రంలో రావు రమేశ్, వరలక్ష్మి శరత్ కుమార్ కీలకపాత్రల్లో నటించారు. మణిశర్మ ఈ చిత్రానికి సంగీతం అందించారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో.. ఈ చిత్రాన్ని శివలెంక కృష్ణప్రసాద్ నిర్మించారు. ఈ మూవీలో ఉన్ని ముకుందన్ కీలక పాత్ర పోషించారు.
🙇♀️🙇♀️🙇♀️#Yashoda pic.twitter.com/O6xdboY0AT
— Samantha (@Samanthaprabhu2) November 18, 2022