Hyper Aadi | ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ తరపున పిఠాపురం వెళ్లి మరి జబర్దస్థ్ టీమ్ అంతా సపోర్ట్ చేశారు. ఆ టీమ్‌లో ఒక రాకింగ్ రాకేష్ మినహా మిగతా వాళ్లంతా ప్రత్యక్షంగానో.. పరోక్షంగానే పవన్‌కళ్యాణ్‌కు ఓటేయమని ప్రచారం చేసినవారే.. ఓకే అంతా ఫైన్.. జనసేన అధినేత పవన్‌కళ్యాన్ ఊహించని భారీ మెజారిటీతో గెలవడం.. జనసేన నుండి పోటీ చేసిన వాళ్లందరూ కూడా గెలిచి 21 స్థానాలకు 21 గెలిచి రికార్డు సృష్టించారు.
ఇక ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పడటం, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావడం, ప్రభుత్వంలో కీలక పదవి డిప్యూటీ సీఎంగా పవన్‌కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేయడం అన్ని చక చకా జరిగిపోయాయి. అయితే ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి 11 స్థానాలు మాత్రమే రావడం అందరికి తెలిసిందే.. ఇక ఎన్నికల్లో గెలుపు ఓటములు సహజం… ఎప్పుడు ఒకటే ప్రభుత్వం వుండదు. ప్రజలు ఎవరిని ఎన్నుకుంటే వాళ్లు కింగ్‌లు అవుతారు. అయితే ఇక్కడ రాజకీయలతో సంబంధం లేని వాళ్లు పదే పదే 11 సీట్ల మీద కామెంట్స్ చేస్తూ.. అది శృతిమించుతుంటే చూసేవారికి అది కాస్త ఇబ్బందిగా వుంటుంది.
అయితే ఈ ప్రస్తావన రావడానికి కారణం హైపర్ ఆది. జబర్ధస్త్ షోతో పాపులర్ అయిన ఆది మొదట్నుంచీ పవన్‌కళ్యాణ్ అభిమానే. ఇటీవల ఎన్నికల్లో కూడా పిఠాపురం వెళ్లి మరి పవన్‌కళ్యాణ్ తరపున ప్రచారం చేశారు. ఇక పవన్‌కళ్యాణ్ డిప్యూటీ సీఎం స్థాయిలో వుండటం ప్రస్తుతం అందరికి తెలిసిందే. అయితే ఎన్నికల ప్రచారంలో విమర్శించిన ఆది.. ఎన్నికల తరువాత కూడా 11 అంకెపై వీలున్నంత వరకు పంచ్‌లు వేస్తుండటం అందరూ గమనిస్తున్నారు.
రీసెంట్గా కమిటీ కుర్రాళ్లు అనే సినిమ వేడుకలో కూడా ఆది మళ్లీ ఈ విషయంలో 11 అంకెపై కామెడీ చేశాడు. అయితే విషయంలో కొంత మంది హ్యాపీగా వుంటే.. మరికొంత మంది ఆది హద్దు దాటుతున్నాడు.. అవసరం వున్నా లేకపోయినా ప్రతి ఫంక్షన్లో, తానుచేసే ప్రొగ్రామ్స్‌లో కూడా 11 అంకెపై పంచ్‌లు వేస్తున్నాడు. అయితే కొంత మంది సినీ జనాలు మాత్రం.. ఇలా సినిమా ఫంక్షన్లో పంచ్‌లు వేయడం అందునా.. కరెక్ట్ కాదు. వైసీపీ ఓటు బ్యాంకు కూడా ఎన్నికల్లో నలబైశాతం వుంది. రాజకీయాలు వేరు, సినిమాలు వేరు.. అనవసరంగా ఒక సినిమాకు ఒక వర్గం వారిని దూరం చేసుకోవడం అవసరమా? ఇకనైనా ఆది ఈ వైసీపీ మీద బహిరంగ వేడుకల్లో ఇలాంటి ఫంచ్లు ఆపితే బాగుండు అని కోరుకుంటున్నారు.!
Also Read..
Mr Bachchan | రవితేజ స్టైలిష్ వార్నింగ్.. మిస్టర్ బచ్చన్ ట్రైలర్ న్యూ లుక్
School bus | స్కూల్ బస్సు బోల్తా, విద్యార్థులకు గాయాలు : వీడియో
Vinesh Phogat | రెజ్లర్ వినేశ్ ఫొగాట్ పతకం ఆశలు గల్లంతు.. అధిక బరువు కారణంగా అనర్హత వేటు..!