Hrithik Roshan | బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తన పేరు, ఇమేజ్ను దుర్వినియోగం చేస్తున్నారని పిటిషన్లో ఆరోపించారు. హృతిక్ దాఖలు చేసిన పిటిషన్‌ను బుధవారం జస్టిస్ మన్మీత్ ప్రీతమ్ సింగ్ ఆరోరా విచారించనున్నారు. తన పేరు, వాయిస్, ఫొటోలను అనుమతి లేకుండా వాణిజ్యపరమైన లాభం కోసం ఉపయోగించుకుంటున్నారని ఆరోపించారు. ఈ మేరకు తనకు తెలిసిన.. తెలియన పార్టీల పేర్లను పిటిషన్లో ప్రస్తావించారు.
గతంలో ఐశ్వర్య రాయ్, అభిషేక్ బచ్చన్, నాగార్జున హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఆయా పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు ఐశ్వర్య రాయ్, అభిషేక్, నాగ్‌లకు అనుకూలంగా ఉత్తర్వులు జారీ చేసింది. పేర్లు, ఫొటోలు, వాయిస్‌ను అనధికారికంగా ఉపయోగించకుండా నిషేధం విధించింది. అలాగే, బాలీవుడ్ ఫేమస్ సింగర్ కుమార్ సాను సైతం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఏఐని ఉపయోగించి తన వాయిస్‌ను అనుకరిస్తున్నారని.. తన హక్కులను ఉల్లంఘించడమేనన్నారు. అదే సమయంలో సునీల్ శెట్టి సైతం తన హక్కులను కాపాడాలని బాంబే హైకోర్టును ఆశ్రయించారు.