టాలీవుడ్ (Tollywood)లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రాల్లో హరిహర వీరమల్లు (Hari Hara Veera Mallu) ఒకటి. పవన్ కల్యాణ్ (Pawan Kalyan) టైటిల్ రోల్ పోషిస్తున్న ఈ చిత్రానికి . క్రిష్ (Krish) దర్శకత్వం వహిస్తున్నాడు. ఇటీవలే సినిమాకొత్త షెడ్యూల్ షూటింగ్ మొదలైంది. పవన్ కల్యాణ్ అండ్ టీం కీలక సన్నివేశాల చిత్రీకరణలో పాల్గొంటుంది.
పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ మూవీ గురించి ఏదో ఒకటి విడుదలవుతూ.. అభిమానుల్లో క్యూరియాసిటీని పెంచుతుంది. ఈ చిత్రంలో పవన్ కల్యాణ్ సుమారు 30 రకాల డ్రెస్సుల్లో కనిపించబోతున్నాడట. ఇపుడీ వార్త టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. మార్షల్ ఆర్ట్స్ నైపుణ్యానికి పదును పెడుతూ ఇప్పటికే పవన్ కల్యాణ్ జాయిన్ అయిన ట్రైనింగ్ సెషన్ ఫొటోలు నెట్టింట్లో ట్రెండింగ్ అయ్యాయి. ఈ షెడ్యూల్ లో పవన్ తనలోని ఫుల్యాక్షన్ అవతార్‌ను చూపించబోతున్నాడు. ఇప్పటికే వచ్చిన అప్ డేట్ ప్రకారం క్రిష్ అండ్ టీం సుమారు 1000 మంది ఆర్టిస్టులతో ఫైట్ సన్నివేశాలను షూట్ చేస్తోంది.
ఈ యాక్షన్ సన్నివేశాల కోసం పవన్ కల్యాణ్ స్పెషల్ ట్రైనింగ్ తీసుకున్నాడు. నిధి అగర్వాల్ ఈ చిత్రంలో పవన్ కల్యాణ్‌కు జోడీగా నటిస్తోంది. ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి మ్యూజిక్ డైరెక్టర్. ఏఎం రత్నం సమర్పణలో ఏ దయాకర్ రావు నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్, జాక్వెలిన్ ఫెర్నాండేజ్ కీలక పాత్రలు పోషిస్తుండగా..నిధి అగర్వాల్ ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తోంది.