Mahavatar Cinematic Universe | కేజీఎఫ్, కేజీఎఫ్ 2, కాంతార, సలార్ వంటి ప్యాన్ ఇండియా బ్లాక్ బస్టర్లు తీసిన నిర్మాణ సంస్థ హోంబాలే ఫిలింస్(Hombale Films) తాజాగా సంచలన విషయం ప్రకటించింది. ఇప్పటికే నటుడు ప్రభాస్‌తో మూడు ప్రాజెక్ట్‌లను ఒకే చేసుకున్న నిర్మాణ సంస్థ తాజాగా ‘మహావతార్ సినిమాటిక్ యూనివర్స్’ అంటూ కొత్త ఫ్రాంచైజీని తీసుకురాబోతుంది. ఇందులో దాదాపు ఏడు సినిమాలు రాబోతుండగా.. ఒక్కో సినిమా రెండు ఏండ్ల గ్యాప్ తేడాతో 2037 వరకు 7 సినిమాలు రాబోతున్నాయి.
‘మహావతార్ సినిమాటిక్ యూనివర్స్’లో భాగంగా మొదటి చిత్రం మహావతార్: నరసింహ 25 జూలై 2025న ప్రేక్షకుల ముందుకు రాబోతుండగా.. మహావతార్ : పరశురామ్ (2027)లో, మహావతార్ : రఘునందన్ (2029)లో, మహావతార్ : ద్వారకాదీశ్ (2031)లో, మహావతార్ : గోకులానంద్ (2033)లో, మహావతార్ : కల్కి 1 (2035)లో మహావతార్ : కల్కి 2 (2037)లో విడుదల కాబోతున్నాయి. విష్ణుమూర్తి పది అవతారాలపై ఈ సినిమాలు రాబోతుండగా.. వీటిలో మొదటి సినిమా ‘మహావతార్: నరసింహ’ ఐదు భాషల్లో ఒకేసారి 25 జూలై 2025న రిలీజ్ కానున్నట్లు నిర్మాణ సంస్థ ప్రకటించింది.
Read More