ఈ మధ్యకాలంలో తెలుగు సినిమాలకు ఇండియావైడ్‌గా క్రేజ్ పెరిగిపోతున్నదని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఎంతలా అంటే ఇండియన్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అని చెప్పుకునే బాలీవుడ్ (HIT – The First Case) సైతం తెలుగు సినిమాలను హిందీలో రీమేక్ చేస్తోంది. ఈ జాబితాలో ఉన్న తెలుగు చిత్రం హిట్..ది ఫస్ట్ కేస్. శైలేష్ కొలను డైరెక్షన్లో విశ్వక్సేన్ హీరోగా నటించిన ఈ మూవీ బాక్సాపీస్ వద్ద విమర్శకుల ప్రశంసలు అందుకుంది.
ఇదే చిత్రాన్ని రాజ్ కుమార్ రావు (Rajkummar Rao) హీరోగా, దంగల్ ఫేం సన్యా మల్హోత్రా (Sanya Malhotra) ఫీ మేల్ లీడ్ రోల్లో హిందీలో రీమేక్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని మే 20న విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈ చిత్ర విడుదలను మరో తేదీకి మారుస్తూ రిలీజ్ డేట్‌ను ఫైనల్ చేసింది టీం. జులై 15న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేస్తున్నట్టు మేకర్స్ ప్రకటించారు.
మిస్టరీ థ్రిల్లర్ HIT – The First Caseను జులై 15న మీ ముందుకు తీసుకొస్తున్నామని, లొకేషన్లో టీం మెంబర్స్ తో దిగిన ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది సన్యా మల్హోత్రా. టాలీవుడ్ నిర్మాత దిల్‌రాజు ఈ చిత్రానికి వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. భూషణ్ కుమార్, క్రిషన్‌కుమార్, కుల్దీప్ రాథోడ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి మానన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నాడు.