Adipurush | ‘ఆదిపురుష్’ ప్రదర్శనను అడ్డుకున్న హిందూ సంస్థ సభ్యులు.. Video
Adipurush | యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఆదిపురుష్. గత శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఇప్పటి వరకు ఈ చిత్రం రూ.400కోట్ల వరకు వసూళ్లను రాబట్టింది. అయితే, చిత్రం విడుదల నుంచి వివాదాల్లో చిక్కుకున్నది. వీఎఫ్ఎక్స్, సినిమాలోని పాత్రధారుల వేషధారణతో పాటు డైలాగ్స్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Adipurush | యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఆదిపురుష్. గత శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఇప్పటి వరకు ఈ చిత్రం రూ.400కోట్ల వరకు వసూళ్లను రాబట్టింది. అయితే, చిత్రం విడుదల నుంచి వివాదాల్లో చిక్కుకున్నది. వీఎఫ్ఎక్స్, సినిమాలోని పాత్రధారుల వేషధారణతో పాటు డైలాగ్స్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా సినిమాలోని డైలాగ్స్‌పై తీవ్రమైన దుమారం రేగుతున్నది. ఈ క్రమంలోని పలు హిందూ సంస్థలు రంగంలోకి దిగి సినిమాను బ్యాన్ చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. ఓ హిందూ సంస్థ ఇప్పటికే ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా లక్నోలో మరో సంస్థ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
తాజాగా మహారాష్ట్ర పాల్ఘర్ జిల్లాలో ఆదిపురుష్ సినిమాకు వ్యతిరేకంగా కొన్ని హిందూ సంఘాల సభ్యులు ఆ సినిమా థియేటర్లోకి ఎంట్రీ ఇచ్చి సినిమా ప్రదర్శనను అడ్డుకున్నారు. నలసోపరాలోని మల్టీప్లెక్స్‌లో సినిమాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అంతటితో ఆగకుండా సినిమా ప్రదర్శన నిలిపివేయాలంటూ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. ‘పిల్లలకు ఈ సినిమా ఎలా చూపిస్తారు ? వారు ఏం నేర్చుకుంటారు ? ఇలాంటి సినిమా చూడడానికి వచ్చారంటే సిగ్గుపడండి’ అంటూ ప్రేక్షకులను మండిపడ్డారు. సినిమాను అడ్డుకునేందుకు ఉరి దాకా వెళ్లాల్సి వచ్చినా వెనక్కి తగ్గేదని ఓ నిరసనకారుడు స్పష్టం చేశాడు. ఇందుకు సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. థియేటర్లో ఆందోళనకారులు జై శ్రీరామ్ అంటూ నినదించారు.
#WATCH | Maharashtra | Members of a few Hindu organisations created a ruckus at a multiplex in Nalasopara, Palghar on Sunday, 18th June while the film #Adipurush was being screened there. The protesters stopped the screening of the film, raised slogans and entered into a verbal… pic.twitter.com/b7BBDKPigm
— ANI (@ANI) June 19, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NTR | నెల్సన్ దర్శకత్వంలో రాక్..? ఎన్టీఆర్‌ను కలిసి కథ చెప్పిన నెల్సన్ దిలీప్‌కుమార్
India Protests | భారత్‌లో విద్యార్థి నిరసనల అణచివేతపై ప్రశ్నించండి.. 13 కోట్ల మంది ఓటర్ల తొలగింపు ఆందోళనకరం
MK Stalin | ‘వెన్నుపోటు’ కాంగ్రెస్‌తో కలిసి పనిచేయం.. సీజేపీ నిరసనలకు స్టాలిన్ మద్దతు
Supreme Court | పనులు చేయకుంటే మేమే ధర్నాకు దిగుతాం.. కేంద్ర ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం
Greater Noida | గ్రేటర్ నోయిడాలో ఘోర విషాదం.. ఐదుగురి ప్రాణం తీసిన నూడుల్స్, టీ!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

