సుహాస్, శివాని నగారం జంటగా నటిస్తున్న కామెడీ ఎంటర్టైనర్ ‘హే భగవాన్!’. గోపి అచ్చర దర్శకుడు. బి.నరేంద్రరెడ్డి నిర్మాత. ‘రైటర్ పద్మభూషణ్’ఫేం షణ్ముఖప్రసాద్ ఈ సినిమాకు కథను అందించారు. తాజాగా ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకున్నది.
ఈ సందర్భంగా నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని చిత్రబృందం ఓ పత్య్రేకమైన వీడియోను విడుదల చేసింది. లొకేషన్లో షూటింగ్ ఎంత సరదాగా జరిగిందో ఈ వీడియో తెలియజెప్పింది. త్వరలో విడుదల కానున్న ఈ సినిమాలో డా.నరేష్ వికె, సుదర్శన్, అన్నపూర్ణమ్మ తదితరులు ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి కెమెరా: మహిరెడ్డి పండుగల, సంగీతం: వివేక్ సాగర్, నిర్మాణం: త్రిశూల్ విజనరీ స్టూడియోస్.