
టాలీవుడ్ (Tollywood)లో రాబోతున్న పాన్ ఇండియా ప్రాజెక్టుల్లో ఒకటి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) నటిస్తోన్న హరిహర వీరమల్లు (Hari Hara Veera Mallu). క్రిష్ (Krish) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన ఓ వార్త ఇపుడు ఫిలింనగర్ సర్కిల్లో రౌండప్ చేస్తోంది. ఈ చిత్రంలో ఫీ మేల్ లీడ్ రోల్ కోసం చాలా కసరత్తు చేసిన తర్వాత నిధి అగర్వాల్ (Nidhi Aggerwal)ను క్రిష్ ఎంపిక చేశాడని తెలిసిందే.
మరోవైపు చిత్రంలో రాణి పాత్ర కోసం శ్రీలంకన్ సుందరి జాక్వెలిన్ ఫెర్నాండేజ్ (Jacqueline Fernandez)ను ఫైనల్ చేశారు ఏఎం రత్నం, క్రిష్ అండ్ టీం. అయితే ఇపుడు జాక్వెలిన్ చుట్టూ మనీ లాండరింగ్ కేసు ఉచ్చు బిగుస్తోంది. దీంతో రిస్క్ తీసుకోవద్దని భావించిన మేకర్స్ మరో హీరోయిన్ను వెతికే పనిలో పడ్డారట. ప్రిన్సెస్ పాత్ర కోసం దిశాపటానీ, కత్రినాకైఫ్ లాంటి హీరోయిన్లను తీసుకొచ్చేందుకు రెడీగా లేరట ఏఎం రత్నం. నర్గీస్ ఫక్రీ, లారిస్సా బొనెసి పేర్లను ఈ పాత్ర కోసం పరిశీలిస్తున్నారని ఇన్సైడ్. మరి ఈ చిత్రానికి రాణి ఎప్పుడు ఫైనల్ అవుతుందా..? అనేది ప్రస్తుతానికి సస్పెన్స్ గా ఉంది.
బాలీవుడ్ యాక్టర్లు అర్జున్ రాంపాల్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి మ్యూజిక్ డైరెక్టర్. సీనియర్ నిర్మాత ఏఎం రత్నం సమర్పిస్తుండగా..ఏ దయాకర్ రావు నిర్మిస్తున్నారు.పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పవన్‌కల్యాణ్ గతంలో కనిపించని పాత్రలో సందడి చేయబోతున్నాడు. 2022 ఏప్రిల్ 29న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. పవన్‌కల్యాణ్ దీంతోపాటు భీమ్లానాయక్, భవదీయుడు భగత్ సింగ్ చిత్రాలు కూడా చేస్తున్నాడు.
ఇవి కూడా చదవండి..
Vicky katrina Wedding Updates | విక్కీకౌశల్-కత్రినా వెడ్డింగ్ అప్డేట్స్
Daniel sekhar meets Kurien | ‘కురియన్’ను కలిసిన ‘డానియల్ శేఖర్’..ఇంతకీ ఇక్కడో తెలుసా..?
Naa Kosam Lyrical Video | సిద్ శ్రీరామ్ మరో మ్యాజిక్..బంగార్రాజు నుంచి ‘నా కోసం’ వీడియో సాంగ్
Mangli Kollywood debut | రూటు మార్చిన సింగర్ మంగ్లీ..!
Mahesh family with star director | స్టార్ డైరెక్టర్ ఫ్యామిలీతో మహేశ్‌బాబు కపుల్