రాంఅగ్నివేష్, రాజీవ్ కనకాల, కాలకేయ ప్రభాకర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘ఇక్షు’. రుషిక దర్శకురాలు. అశ్వినినాయుడు నిర్మాత. ఎన్టీఆర్ జన్మదినం సందర్భంగా శుక్రవారం సినిమాలోని ఎన్టీఆర్ డైలాగ్‌ను హీరో శ్రీకాంత్ విడుదలచేశారు. ఆయన మాట్లాడుతూ ‘చక్కటి అభిరుచితో, అత్యున్నత నిర్మాణ విలువలతో ఈ సినిమాను రూపొందించారు. ఎన్టీఆర్ డైలాగ్‌ను అగ్నివేష్ సింగిల్టేక్లో చెప్పడం గొప్ప విషయం’ అని తెలిపారు. నిర్మాత మాట్లాడుతూ ‘చిన్న సినిమాకు శ్రీకాంత్ అండగా నిలవడం ఆనందంగా ఉంది. కొన్ని సన్నివేశాలు చూడటమే కాకుండా మేము చేసిన తప్పుల్ని సరిదిద్దుతూ చక్కటి సలహాలిచ్చారు’ అన్నారు.