నటుడు శివాజీ నటిస్తూ ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సుధీర్ శ్రీరామ్ దర్శకుడు. శివాజీ ప్రొడక్షన్స్ పతాకంపై రూపొందుతున్న ఈ సినిమాలో ఉత్తర అనే పాత్రలో నటి లయ నటిస్తున్నది. దసరా సందర్భంగా ఈ సినిమాకు సంబందించిన అప్డేట్ను మేకర్స్ ప్రకటించారు.
ఇంకా టైటిల్ ఖరారు చేయని ఈ మూవీలో లయ పోషిస్తున్న ఉత్తర పాత్రను పరిచయం చేస్తూ ఓ స్పెషల్ పోస్టర్ని విడుదల చేశారు. ఇందులో లయ పోషిస్తున్న గృహిణి ఉత్తర పాత్రలో ఎన్నో వేరియేషన్స్ ఉన్నాయని పోస్టర్ చెబుతున్నది. ఈ చిత్రానికి కెమెరా: రిత్విక్‌రెడ్డి, సంగీతం: రంజిన్ రాజ్.