హైదరాబాద్: రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీడ్ ఇండియా చాలెంజ్ (Green India Challenge) విజయవంతంగా కొనసాగుతున్నది. సెలబ్రెటీల నుంచి సామాన్యుల వరకు ఈ కార్యక్రమంలో పాలుపంచుకుంటున్నారు. తాజాగా ప్రముఖ నటుడు దుల్కర్ సల్మాన్ (Dulquer Salman) మొక్కలు నాటారు. హీరోయిన్ అదితీ రావు హైదరీ ఇచ్చిన చాలెంజ్‌ను స్వీకరించిన దుల్కర్.. హైదరాబాద్‌లోని కేబీఆర్ పార్కులో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో పాల్గొనడం పల్ల సంతోషం వ్యక్తం చేశారు. ఇంత గొప్ప కార్యక్రమాన్ని చేపట్టిన ఎంపీ సంతోష్ కుమార్ అభినందించారు.
‘గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో భాగమవడం చాలా సంతోషాన్నిచ్చింది. మొక్కలు నాటడమే కాకుండా వాటిని సంరక్షించడం కూడా అలవాటు చేసుకోవాలి. మొక్కలు, చెట్లను సంరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత. తద్వారా మనకే కాకుండా అనేక తరాల కాలుష్య రహిత వాతావరణం సమకూరుతుంది’ అని అన్నారు. ఈ సందర్భంగా దుల్కర్ సల్మాన్‌కు గ్రీన్ ఇండియా చాలెంజ్ సహ వ్యవస్థాపకులు వేద వృక్షం పుస్తకాన్ని అందించారు.