Animal | రణ్‌బీర్ కపూర్ (Ranbirkapoor), రష్మిక మందన్న (Rashmika Mandanna) జోడీగా దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా ‘యానిమల్’ (Animal) తెరకెక్కిస్తున్నారు. బాబీ దేవోల్, అనిల్ కపూర్‌లాంటి క్రేజీ కాంబినేషన్ ఉండటంతో ఈ చిత్రంపై మొదట్నుంచీ ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. టీజర్ రణ్‌బీర్ కపూర్ మాస్ అవతారం చూశాక.. అంచనాలు మరింత పెరిగాయి. అయితే ఇప్పుడీ సినిమా రన్ టైం ఆసక్తికమైన చర్చ నడుస్తోంది. యానిమల్ ఈ చిత్రం నిడివి 3.20గంటలకు పైగానే అని ప్రచారం జరుగుతోంది.
3.20 నిముషాలు అంటే చాలా ఎక్కువ. ఇంత రన్‌టైమ్ ఉన్న సినిమాలు ఈ మధ్యకాలంలో రాలేదు. ఇటీవలే టైగర్ నాగేశ్వరరావు మూడు గంటల నిడివితో విడుదల చేశారు. అయితే అంత నిడివిని ప్రేక్షకులు బోర్‌గా ఫీలయ్యారు. ఆ తర్వాత మేకర్స్ ఇరవై నిముషాలు ట్రిమ్ చేశారు. ఇప్పుడు యానిమల్ ఏకంగా 3.20 గంటలు అంటే పెద్ద రన్ టైమే. అయితే ఇందులో వాస్తవం ఎంత అనే దానిపై చిత్రబృందం స్పందించాల్సి ఉంది. డిసెంబర్ 1న ఈ సినిమా వస్తోంది.
Satranga సాంగ్..
తెలుగు వెర్షన్ సాంగ్..