Maha Samudram pre release business | శర్వానంద్ ( sharwanand ), సిద్ధార్థ్ ( siddharth ) ప్రధాన పాత్రల్లో అజయ్ భూపతి ( ajay bhupathi ) తెరకెక్కించిన చిత్రం మహా సముద్రం. ఆర్ఎక్స్ 100 లాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తర్వాత మూడేళ్లకు పైగా గ్యాప్ తీసుకుని ఈ సినిమాను తెరకెక్కించాడు అజయ్ భూపతి. దీనిపై అంచనాలు కూడా బాగానే ఉన్నాయి. ముఖ్యంగా తొమ్మిదేళ్ల తర్వాత సిద్దార్థ్ నటించిన తెలుగు సినిమా ఇది. పైగా ఈ మధ్య మల్టీస్టారర్ సినిమాలు బాగానే వస్తున్నాయి. మహా సముద్రం ట్రైలర్ కూడా మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఇంకా చెప్పాలంటే ఈ మధ్య కాలంలో ఏ ట్రైలర్‌కు రానంత పాజిటివ్ ఫీడ్ బ్యాక్ దీనికే వచ్చింది. అజయ్ భూపతి కసి ఈ ట్రైలర్లో కనిపించింది అంటూ విమర్శకులు కూడా సలాం కొట్టేశారు. మూడేళ్ల పాటు ఎన్నో కష్టాలకు ఓర్చి ఈ సినిమా తెరకెక్కించాడు ఈ దర్శకుడు. దసరా కానుకగా అక్టోబర్ 14న మహా సముద్రం థియేటర్లలోకి వస్తుంది. ఇందులో మహా పాత్రలో అదితి రావు హైదరీ ( aditi rao hydari ) నటించింది. అను ఇమ్మాన్యుయేల్ ( anu emmanuel ) మరో హీరోయిన్. ఈ సినిమాకు ప్రీ రిలీజ్ బిజినెస్ భారీగానే జరిగింది. శర్వానంద్ ఉన్నాడు కాబట్టి మంచి బిజినెస్ చేశారు. మరి మహా సముద్రం ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత అయింది? సినిమా హిట్ అవ్వాలంటే ఎంత వసూలు చేయాలో చూద్దాం..
నైజాం: 5.5 కోట్లు
సీడెడ్: 2.50 కోట్లు
ఉత్తరాంధ్ర: 2.00 కోట్లు
ఈస్ట్: 1.25 కోట్లు
వెస్ట్: 1.00 కోట్లు
గుంటూరు: 1.30 కోట్లు
కృష్ణా: 1.00 కోట్లు
నెల్లూరు: 0.65 కోట్లు
ఏపీ + తెలంగాణ: 15.2 కోట్లు షేర్
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్: 1.50 కోట్లు
వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్: 16.70 కోట్లు షేర్
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
మహా సముద్రంలో చాలా ట్విస్టులుంటాయి: చేతన్ భరద్వాజ్
Maha samudram: దసరా బరిలో మహా సముద్రం.. ఈ పండుగైన కలిసొస్తుందా..!
aditi rao hydari | లెజెండరీ బయోపిక్‌లో నటించాలని ఉందట..|
Poonam Kaur: మోసగాళ్లు బాగుపడలేరన్న సిద్దార్థ్..నిజమేనన్న పూనమ్ కౌర్