Poonam Kaur: మోసగాళ్లు బాగుపడలేరన్న సిద్దార్థ్..నిజమేనన్న పూనమ్ కౌర్

ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉన్న టాపిక్ నాగ చైతన్య-సమంత విడాకుల అంశం. శనివారం మధ్యాహ్నం వారు తమ సోషల్ మీడియా ద్వారా ఇద్దరం విడాకులు తీసుకుంటున్నాం అని తెలియజేశారు. ఇన్నాళ్ల సస్పెన్స్ కు తెర దించేలా నాగ చైతన్య మరియు సమంతలు ఇద్దరు కూడా ఒకే నోట్ ను తమ తమ సోషల్ మీడియా అకౌంట్స్ లో షేర్ చేశారు. చాలా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నాం. ఎవరి దారిలో వారు నడవాలనే నిర్ణయానికి వచ్చేశాం. మా ప్రైవసీకి భంగం కలిగించేలా ఎవరు వ్యవహరించకూడదు అంటూ నోట్ లో పేర్కొన్నారు.
వారి నిర్ణయం తర్వాత అభిమానులతో పాటు పలువురు ప్రముఖులు షాక్ అయ్యారు. ఎంతో చూడచక్కగా ఉండే ఈ జంట ఇలా విడిపోవడం బాధను కలిగిస్తుందని పలువురు పేర్కొన్నారు. అయితే సామ్ విడాకులు ప్రకటించిన కొద్ది సేపటికి సిద్దార్థ్ చేసిన ట్వీట్ అందరి దృష్టిని ఆకర్షించింది. మోసగాళ్లు ఎప్పటికీ బాగు పడలేదు. ఇది చిన్నప్పుడు స్కూల్లో టీచర్స్ నేర్పిన పాఠం.. మీరు ఏమంటారు అని సిద్దార్థ్ ట్వీట్ చేశాడు. ఆ ట్వీట్‌కు పూనమ్ కౌర్ స్పందించింది. అవును అది నిజమే అని రిప్లై ఇచ్చింది. ఈ ట్వీట్ చేసింది ఎవరి గురించి అంటూ సోషల్ మీడియాలో హాట్ హాట్ డిస్కషన్స్ నడుస్తున్నాయి. కాగా, చైతన్యని పెళ్లి చేసుకునే ముందు సమంత- సిద్దార్థ్‌తో పీకల్లోతు ప్రేమాయణం నడిపిన విషయం తెలిసిందే.
ఇది కూడా చూడండి
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- poonam kaur
- saamantha
- siddarth
RELATED ARTICLES
తాజా వార్తలు
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
Vidadala Rajini | ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం.. మాజీ మంత్రిని కిందపడేసి ఎస్సై దాష్టీకం
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
Pattiseema | 100 రోజులు ఏపీలో ఆగకుండా ఎత్తిపోత.. పట్టిసీమతో 65 టీఎంసీల గోదావరి జలాలు తరలింపు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

