Hari Hara Veera Mallu | టాలీవుడ్ యాక్టర్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) టైటిల్ రోల్లో నటిస్తోన్న చిత్రాల్లో ఒకటి హరిహరవీరమల్లు (Hari Hara Veera Mallu). జ్యోతికృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ఇస్మార్ట్ భామ నిధి అగర్వాల్ ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తోంది. షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా గురించి నెట్టింట కొన్ని ఆసక్తికర విషయాలు రౌండప్ చేస్తున్నాయి.
తాజా టాక్ ప్రకారం మచిలీ పట్నం పోర్ట్ ఫైట్‌తో పవన్ కల్యాణ్ గ్రాండ్ ఎంట్రీ ఉండబోతుందట. అంతేకాదు క్లైమాక్స్‌లో వచ్చే రెడ్ డ్రెస్ ఫైట్‌ను 42 రోజులపాటు చిత్రీకరించినట్టు ఇన్సైడ్ టాక్. ఇంట్రో సాంగ్, టైగర్ ఫైట్, మహల్ యాక్షన్ పార్ట్, కుస్తీ ఫైట్ సీన్, చార్మినార్ యాక్షన్ సన్నివేశాలు, ప్రీ ఇంటర్వెల్, ఇంటర్వెల్ భారీ యాక్షన్ సీక్వెన్స్, క్లైమాక్స్ వార్ సీన్.. ఇలా మూవీ లవర్స్‌ను ఊపిరాడకుండా చేసే గూస్బంప్స్ తెప్పించే ఎలిమెంట్స్ ఉండబోతున్నాయన్న వార్త ఫిలింనగర్ సర్కిల్లో రౌండప్ చేస్తూ సినిమాపై ఆసక్తిని రేకెత్తిస్తోంది.
క్లైమాక్స్ చివరలో 8 నిమిషాలపాటు వచ్చే సీక్వెన్స్ వీఎఫ్ఎక్స్ పార్ట్ కోసం ఏకంగా రూ.15 కోట్లు ఖర్చుపెడుతున్నారని వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. మరి ఇదే నిజమైతే పవన్ కల్యాణ్ అభిమానులకు పండగే అని చెప్పొచ్చు.
ఈ మూవీలో బాలీవుడ్ నటుడు, దర్శక నిర్మాత అనుపమ్ ఖేర్, అర్జున్ రాంపాల్, నర్గీస్ ఫక్రీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్న ఈ మూవీ రెండు పార్టులుగా రానుంది. పార్ట్ 1ను మార్చి 28న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించారు మేకర్స్.
Aamir Khan | నేను రాత్రంతా తాగేవాడిని.. తన వ్యసనాల గురించి అమీర్‌ఖాన్ షాకింగ్ కామెంట్స్