Spirit | గ్లోబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) అభిమానులకు ఫుల్ ఎంటర్టైన్ మెంట్ అందించేందుకు బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్లో పెట్టాడని తెలిసిందే. వీటిలో మోస్ట్ ఎవెయిటెడ్ ప్రాజెక్ట్ స్పిరిట్ (Spirit). యానిమల్ ఫేం సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రానికి సంబంధించి ఏదో ఒక వార్త నెట్టింట రౌండప్ చేస్తూ అభిమానులు, మూవీ లవర్స్‌లో జోష్ నింపుతోంది.
అన్అఫీషియల్ ఎక్స్ హ్యాండిల్లో సినిమా లాంచ్ సెప్టెంబర్ 2న ఉండబోతున్నట్టు పోస్ట్ దర్శనమిచ్చింది. దీంతో ఇక స్పిరిట్ మొదలవనుందని ఆనందంలో ఎగిరి గంతేసిన అభిమానులు కొందరు వార్తను తెగ షేర్ చేయడం మొదలుపెట్టారు. అయితే అసలు విషయం అది కాదని.. లాంచ్‌కు సంబంధించి ఇంకా ఎలాంటి ప్లాన్ చేయలేదంటూ మరో వార్త ఫిలింనగర్ సర్కిల్లో రౌండప్ చేస్తోంది. ఈ నేపథ్యంలో ఇంతకీ సినిమా లాంచ్ ఉన్నట్టా..? లేనట్టా..? అని డైలమాలో పడిపోయారు అభిమానులు.
అయితే స్పిరిట్‌కు సంబంధించి ఎటువంటి ప్రకటననైనా సందీప్ రెడ్డి వంగా ప్రొడక్షన్ టీం నుంచి వస్తేనే ఓ స్పష్టత వచ్చే అవకాశాలున్నాయని సమాచారం. హై ఓల్టేజీ కాప్ డ్రామా నేపథ్యంలో రాబోతున్న ఈ చిత్రంలో యానిమల్ ఫేం తృప్తి డిమ్రి హీరోయిన్గా ఫైనల్ అయింది. భద్రకాళి పిక్చర్స్, టీ సిరీస్‌తో కలిసి సంయుక్తంగా తెరకక్కిస్తున్న ఈ చిత్రానికి హర్షవర్ధన్ రాణే సంగీతం అందిస్తున్నాడు. స్పిరిట్‌లో పాపులర్ సౌత్ కొరియన్ యాక్టర్ (డాన్ లీ) మడాంగ్సియోక్ (MaDongSeok) విలన్‌గా నటిస్తున్నాడు.
Anjali Raghav | అనుచితంగా హీరోయిన్ నడుము తాకిన స్టార్ నటుడు.. వివాదంపై స్పందించిన నటి
Vishal – Dhansika | ఇద్దరు ఒక్క సినిమా కూడా చేయలేదు.. విశాల్, ధన్సిక మధ్య ప్రేమ ఎలా పుట్టింది?