83 movie collections | సాధారణంగా సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే నిర్మాత నిశ్చింతగా పడుకుంటాడు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో బ్లాక్‌బస్టర్ టాక్ వచ్చినా కూడా సినిమా సేఫ్ అవుతుందా అనే అనుమానాలు అందరిలోనూ వస్తున్నాయి. ఎందుకంటే బయట పరిస్థితులు అలా ఉన్నాయి. తాజాగా 83 సినిమా విషయంలో ఇది మరోసారి ప్రూవ్ అవుతుంది. ఇండియన్ క్రికెట్ హిస్టరీని మలుపుతిప్పిన 1983 వరల్డ్ కప్ నేపథ్యంలో కబీర్ ఖాన్ తెరకెక్కించిన 83 సినిమాకు అద్భుతమైన టాక్ వచ్చింది. దాదాపు 200 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కింది. రణవీర్ సింగ్ హీరోగా నటించిన ఈ సినిమాలో దీపికా పదుకొనే హీరోయిన్.
ఒక రకంగా ఈ సినిమాలో కపిల్ దేవ్ హీరో. ఆయన పాత్రలో రణవీర్ సింగ్ నటించాడు. సినిమాపై ముందు నుంచి ఉన్న అంచనాల నేపథ్యంలో కచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుందని అందరూ అనుకున్నారు. కానీ 5 రోజుల తర్వాత అతికష్టంగా 100 కోట్ల మార్క్ అందుకుంది ఈ సినిమా. విడుదల రోజు ఇండియాలో కేవలం 12.64 కోట్లు మాత్రమే వసూలు చేసింది ఈ సినిమా. ఆ తర్వాత వరుసగా శనివారం 16.95 కోట్లు, ఆదివారం 17.41 కోట్లు, సోమవారం 7.29 కోట్లు, మంగళవారం 6.70 కోట్లు రాబట్టింది. దాంతో ఐదు రోజుల్లో ఈ చిత్రం ఇండియాలో రూ. 60.99 కోట్ల షేర్ వసూలు చేసింది. అలాగే ఓవర్సీస్లో సుమారు రూ.26 కోట్లు తీసుకొచ్చింది.
ఇక ప్రపంచ వ్యాప్తంగా వసూళ్లు ఒకసారి లెక్కలు వేసుకుంటే తొలి రోజు రూ.25.16 కోట్లు, రెండో రోజు 29.41 కోట్లు, మూడో రోజు 29.34 కోట్లు, నాలుగో రోజు 11.29 కోట్లు, ఐదో రోజు 10 కోట్లు వసూలు చేసింది. ఇప్పటి వరకు 104 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. సినిమాపై ఉన్న అంచనాలతో పోలిస్తే వచ్చిన ఈ వసూళ్లు మాత్రం నిర్మాతలతో పాటు బయ్యర్లకు నిరాశనే మిగిల్చాయి. సినిమా సేఫ్ అవ్వాలంటే ఇంకా చాలా దూరం వెళ్లాలి. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితులు అందుకు అనుకూలంగా లేవు. ఇప్పటికే ఢిల్లీ, ముంబై మరికొన్ని రాష్ట్రాలలో 50 శాతం ఆక్యుపెన్సీతో పాటు నైట్ కర్ఫ్యూ విధించారు. దాంతో 83 డిజాస్టర్ దిశగా అడుగులు వేస్తుంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Deepika Padukone | అది నరకం.. ఆ సమయంలో నేను ఏం చేశానో నాకే తెలియదు: దీపిక భావోద్వేగం
పసికూనగా ఉన్న టీమిండియా 1983లో ప్రపంచకప్ ఎలా గెలిచింది? అప్పుడేం జరిగింది?
బుర్ఖాలో థియేటర్‌కి వచ్చిన ఈ హీరోయిన్ ఎవరో తెలుసా..?
పవన్ కళ్యాణ్ వన్ మ్యాన్ ఆర్మీ.. పవర్‌స్టార్‌ను పొగడ్తలతో ముంచెత్తిన నిధి అగర్వాల్