Hebah Patel | కుమారి 21ఎఫ్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీని షేక్ చేసింది ముంబై భామ హెబ్బా పటేల్ (hebah patel). ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ చిత్రాల్లో నటించింది. ఓదెల రైల్వే స్టేషన్లో చిత్రంలో పర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ రోల్లో నటించి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇప్పటికే మూడు సినిమాలను లైన్లో పెట్టింది హెబ్బాపటేల్. అయితే తాజా మరో కొత్త ప్రాజెక్ట్‌కు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఈ సారి వెబ్‌సిరీస్‌తో అలరించేందుకు రెడీ అయింది. ఓయ్ ఫేం ఆనంద్ రంగా దర్శకత్వంలో హెబ్బా పటేల్ నటిస్తున్న వెబ్ ప్రాజెక్ట్ వ్యవస్థ.
ఇవాళ వ్యవస్థ (Vyavastha) టైటిల్ లుక్‌ను మేకర్స్ విడుదల చేశారు. పోస్టర్ బ్యాక్ డ్రాప్లో కోర్టు కనిపిస్తుండగా.. మరోవైపు న్యాయమూర్తి బెంచ్‌పై నోట్లు చూడొచ్చు. మొత్తానికి ఏదో ఒక సీరియస్ అంశాన్ని లేవనెత్తుతూ ఈ వెబ్ ప్రాజెక్ట్ ఉండబోతుందని తాజా లుక్‌తో చెప్పేస్తుంది హెబ్బా పటేల్. ఓటీటీ ప్లాట్‌ఫాం జీ5లో త్వరలోనే ప్రీమియర్ కానుంది. నా నెక్ట్స్ ప్రాజెక్ట్ జీ5 సిరీస్ చేస్తుండటం సూపర్ ఎక్జయిటింగ్‌గా ఉంది..అంటూ హెబ్బా పటేల్ షేర్ చేసిన లుక్ నెట్టింట్ల ట్రెండింగ్ అవుతోంది.
రాజేంద్రప్రసాద్ వన్ ఆఫ్ ది కీ రోల్లో నటించిన శాసనసభలో స్పెషల్ సాంగ్‌లో మెరిసింది హెబ్బాపటేల్. ఈ భామ ఖాతాలో తెలిసినవాళ్లు, వల్లన్, ఆద్య సినిమాలున్నాయి. తెలిసినవాళ్లు, వల్లన్ ప్రాజెక్టులు షూటింగ్ పూర్తి చేసుకోగా.. ఆద్య చిత్రీకరణ దశలో ఉంది. ఓ వైపు గ్లామరస్ పాత్రలకు ఓకే చేస్తూనే మరోవైపు నటనకు ఆస్కారమున్న సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంది హెబ్బాపటేల్. ఈ సారి వెబ్‌సిరీస్‌తో ఎలాంటి క్రేజ్ సంపాదిస్తుందో చూడాలంటున్నారు సినీ జనాలు.
వ్యవస్థ టైటిల్ లుక్..
Read Also :
SAINDHAV | సైంధవ్ క్రేజీ న్యూస్.. సిల్వర్ స్క్రీన్‌పై వెంకటేశ్-నాని కాంబినేషన్
Mano | మల్టీ టాలెంటెడ్ సింగర్ మనోకు అరుదైన గౌరవం
Hombale Films | హోంబలే ఫిలిమ్స్ నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్.. ఇంతకీ ఏంటో తెలుసా..?