Hebah Patel | ‘ఇందులో నా పాత్ర పేరు సుహానా. బాగా డబ్బున్న అమ్మాయి. బబ్లీ గార్ల్. ఇంట్లో ఇచ్చిన ఫ్రీడమ్ వల్ల నచ్చిన వెకేషన్‌కు వెళ్తూ ఉంటుంది. అలా ఓ చోట హీరోని కలుస్తుంది. ఆ కలయిక ప్రేమగా మారుతుంది. తర్వాత ఏం జరిగింది? అనేదే ఈ సినిమా కథ. నాకు బాగా నచ్చిన కథ ఇది. చాలాకాలం తర్వాత ఈ తరహా పాత్ర చేశాను. అయితే.. కష్టం అనిపించలేదు. ఈజీగా చేసేశా.’ అని హెబ్బా పటేల్ అన్నారు. చేతన్ కృష్ణకు ఆమె జోడీగా నటించిన చిత్రం ‘ధూం ధాం’. సాయికిశోర్ మచ్చా దర్శకుడు. ఎం.ఎస్.రామ్‌కుమార్ నిర్మాత. ఈ నెల 8న సినిమా విడుదల కానుంది.
ఈ సందర్భంగా సోమవారం హైదరాబాద్‌లో హెబ్బా పటేల్ విలేకరులతో ముచ్చటించింది. ‘మంచి ఫ్యామిలీ ఎంటైర్టెనర్ ఇది. పోలెండ్‌లో అంద మైన ప్రదేశాల్లో చిత్రీకరణ జరిపాం. నిర్మాత రామ్‌కుమార్ మమ్మల్ని చాలా బాగా చూసుకున్నారు. పోలెండ్‌లో ఏ రోజూ మాకు ఇబ్బంది కలగలేదు. ఆయన పాషన్‌తో నిర్మించిన సినిమా ఇది. దర్శకుడు సాయికిశోర్ సరదాగా ఉంటూ, ఈజీగా మానుంచి అవుట్‌పుట్ తీసుకున్నారు. చేతన్ మంచి కోస్టార్. ఇద్దరం పోటీపడి నటించాం. గోపీసుందర్ సంగీతం సినిమాకు హైలైట్‌గా నిలుస్తుంది. కుటుంబ భావోద్వేగాలు, ప్రేమ, వినోదం మేళవింపుగా రూపొందిన ‘ధూం ధాం’ అందర్నీ ఆట్టుకుంటుందని నమ్మకంతో ఉన్నాం’ అని హెబ్బా పటేల్ చెప్పారు.